STOCKS

News


హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ...

Saturday 11th August 2018
news_main1533956817.png-19153

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎ౾ంఆర్‌ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల కాంట్రాక్టులను ఎల్ అండ్‌ టీ, మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్టు విలువ రూ.3,028 కోట్లు కాగా మెగావైడ్‌ దక్కించుకున్న కాంట్రాక్టు విలువ రూ.980 కోట్లు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ మేరకు రెండు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. కాంట్రాక్టుల ప్రకారం టెర్మినల్ భవంతి విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను 42 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రస్తుతం వార్షికంగా 1.2 కోట్ల ప్రయాణికులుగా ఉన్న సామర్ధ్యాన్ని 3.4 కోట్లకు పెంచుకోనున్నట్లు జీఎంఆర్ పేర్కొంది. 



You may be interested

యూకో బ్యాంక్‌ నష్టాలు రూ.634 కోట్లు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.634 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.663 కోట్లు, సీక్వెన్షియల్‌గా వచ్చిన నష్టాలు రూ.2,134 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో నికర నష్టాలు తగ్గాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.4,237 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,361 కోట్లకు

జేఎల్‌ఆర్‌కు ట్రేడ్‌వార్‌ సెగ

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ తెలిపారు. జాగ్వార్‌ బ్రాండ్‌ సేల్స్‌ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్‌

Most from this category