STOCKS

News


ల్యాంకో ప్లాంటులోనికి వెళ్లనివ్వటం లేదు

Thursday 13th December 2018
news_main1544678406.png-22890

సాక్షి, హైదరాబాద్‌: ల్యాంకో ఇన్‌ఫ్రాకు చెందిన ల్యాంకో బబంద్‌ పవర్‌ లిమిటెడ్‌ (ఎల్‌బీపీఎల్‌) దివాలా ప్రక్రియలో భాగంగా ఒడిశాలో ఉన్న ఆ కంపెనీ ఆస్తుల స్వాధీనానికి వెళ్లిన తనను స్థానిక కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) యు.బాలకృష్ణభట్‌ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ జుడీషియల్‌ సభ్యుడు కె.అనంత పద్మనాభ స్వామి... బాలకృష్ణ భట్‌కు తగిన రక్షణ కల్పించాలంటూ ఒడిస్సా, డెంకనల్‌ జిల్లా కలెక్టర్, ఎస్‌పీలను ఆదేశించారు. ఎల్‌బీపీఎల్‌ ఆస్తుల స్వాధీనానికి వెళ్లినప్పుడు భట్‌కు తగిన రక్షణ కల్పించాలని స్వామి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎల్‌బీపీఎల్‌ తమకు రూ.1428.33 కోట్ల మేర బకాయి ఉందని, అయితే ఆ బకాయిలను చెల్లించని నేపథ్యంలో ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన ట్రైబ్యునల్... ల్యాంకో బబంద్‌ పవర్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు అనుమతినిచ్చింది. పరిష్కార నిపుణుడిగా (ఆర్‌పీ) ముంబైకి చెందిన బాలకృష్ణ భట్‌ను నియమించింది. దివాలా ప్రక్రియలో భాగంగా ఆయన ఒడిశా, డెంకనల్‌ జిల్లా, కర్గప్రసాద్, కురుంటి గ్రామాల్లో ఎల్‌బీపీఎల్‌కు ఉన్న ఆస్తుల స్వాధీనానికి వెళ్లారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. చేసిన పనులకు ల్యాంకో బబంద్‌ పవర్‌ లిమిటెడ్‌ స్థానిక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు వేరేవారెవ్వరినీ ఆ కంపెనీలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ భట్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ కంపెనీ ప్లాంట్, యంత్ర సామాగ్రి, ఆస్తులు
తదితర సామగ్రి విలువను మదింపు చేస్తే తప్ప దివాలా ప్రక్రియ ముందుకు సాగదని, అందువల్ల తనకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ట్రిబ్యునల్‌ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్, భట్‌ కోరిన ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 13th December 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.50డాలర్‌ నష్టపోయి 1,249.30 డాలర్‌ వద్ద  ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.08 వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఈ దేశ ప్రధాని థెరిస్సా మే పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోవడంతో పాటు వాణిజ్య వివాదాలు సమిసిపోయేందుకు అమెరికాతో మరిన్ని

మళ్లీ మిడ్‌క్యాప్‌ మెరుపులుంటాయా?

Thursday 13th December 2018

ఎన్నికల ఏడాది చిన్నషేర్ల సందడిపై ఆశలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయాన మరలా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కౌంటర్లలో సందడి మొదలైంది. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో చిన్న స్టాకులు మంచి రాబడులు అందిస్తూ వస్తున్నాయి. ఈ సారి కూడా ఇదే ధోరణి ఉంటుందన్న అంచనాలతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ఏడాది కాలపరిమితిగా పెట్టుబడులు పెట్టదలచినవాళ్లు ఈ సమయంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని మ్యూచువల్‌ ఫండ్‌ నిపుణులు

Most from this category