STOCKS

News


వృద్ధి రేటు 7.2 శాతం

Tuesday 8th January 2019
news_main1546939801.png-23466

- వ్యవసాయం, తయారీ పరిశ్రమల దన్ను
- 2018-19పై సీఎస్‌ఓ అంచనాలు
- ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) వ్యవసాయం, తయారీ రంగాలు వెన్నుదన్నుగా నిలవనున్నాయని కేం‍ద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. దీనితో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదుకానున్నట్లు అంచనావేసింది. 2017-18లో ఈ రేటు 6.7 శాతం​ కావడం గమనార్హం. సీఎస్‌ఓ సోమవారం విడుదల చేసిన జీడీపీ  మొదటి ముందస్తు అంచనాలను క్లుప్తంగా చూస్తే...
- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2018-19 సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి రేటు ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత సీఎస్‌ఓ అంచనాలు ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. 
- 2016-17లో వృద్ధి 7.1 శాతంకాగా అంతక్రితం ఏడాది (2015-16) వృద్ధి రేటు 8.2 శాతం. 
- కేవలం పరిశ్రమ ఉత్పత్తికి సంబంధించి వాస్తవ జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం.  అయితే, 2018-19లో 7 శాతంగా ఉండే వీలుంది.
- వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 3.8 శాతానికి పెరుగుతుంది. 
- తయారీ రంగం వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగే అవకాశం.
- అయితే, మైనింగ్‌ క్వారీయింగ్‌ రంగంలో​ ఉన్న క్షీణ రేటు - 2.9 శాతం నుంచి - 0.8 శాతానికి తగ్గే వీలుంది.
- వాణిజ్యం, హోటెల్స్‌, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల రంగాల్లో క్షీణ రేటు కూడా - 8 శాతం నుంచి -6.9 శాతానికి తగ్గవచ్చు.
- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రక్షణ ఇతర సేవల విభాగంలో వృద్ధి రేటు 10 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 
- విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 9.4 శాతానికి పెరుగుతుంది. 
- నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 8.9 శాతానికి పెరిగే అవకాశం.
- ఫైనాన్షియల్‌, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవల వృద్ధి రేటు స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.8 శాతానికి చేరుతుంది. 
- పెట్టుబడులకు సూచిక అయిన స్థూల స్థిర పెట్టుబడుల పరిమాణం (జీఎఫ్‌సీఎఫ్‌) రూ.47.79 లక్షల కోట్ల నుంచి రూ.55.58 లక్షల కోట్లకు పెరగనుంది. 
తలసరి ఆదాయం రూ.1,25,397
జాతీయ తలసరి ఆదాయం 2018-19లో రూ.1,25,397గా ఉండొచ్చని సీఎస్‌ఓ పేర్కొంది. 2017-18లో ఈ మొత్తం రూ. 1,12,835. అప్పట్లో ఇది 8.6 శాతం వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 11.1 శాతంగా ఉండనుంది. 



You may be interested

ద్రవ్య లభ్యత సమస్యల్లేవు!

Tuesday 8th January 2019

- అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటాం - ఇష్టానుసారం రైతు రుణ మాఫీలు సరికాదు - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టీకరణ - చిన్న, లఘు, మధ్యతరహా ప్రతినిధులతో సమావేశం న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఉద్ఘాటించారు. అవసరమైతే తగిన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టంచేశారు. గవర్నర్‌ సోమవారం లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులతో

బంధన్ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌

Tuesday 8th January 2019

- షేర్ల మార్పిడి రూపంలో విలీనం - విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లు - డీల్ జనవరి 1 నుంచి వర్తింపు  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా గృహ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు  ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది.  ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ

Most from this category