STOCKS

News


87 శాతం తగ్గిన గతి లాభం

Wednesday 14th November 2018
news_main1542172729.png-21971

సెప్టెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో గతి లిమిటెడ్‌ నిరాశపరిచింది. నికరలాభం ‍క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87.5 శాతం తగ్గి రూ.2.6 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.434 కోట్ల నుంచి రూ.468 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.929 కోట్ల టర్నోవరుపై రూ.8.2 కోట్ల నికరలాభం సాధించింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 4.23 శాతం అధికమై రూ.86.25 వద్ద స్థిరపడింది.



You may be interested

మూడు రెట్లు పెరిగిన టాటా స్టీల్‌ లాభం

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్‌ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.1,018 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,116 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్‌ తెలిపింది. ఇక ఆదాయం రూ.32,676 కోట్ల నుంచి రూ.43,899 కోట్లకు ఎగసిందని టాటా స్టీల్‌​ సీఈఓ, ఎమ్‌డీ టీవీ నరేంద్రన్‌ తెలిపారు. గత క్యూ2లో రూ.4,720

10,600 దిగువన నిఫ్టీ

Wednesday 14th November 2018

లాభాలతో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు గంట తర్వాత యూటర్న్‌ తీసుకున్నాయి. రూపాయ రికవరీ కారణంగా ఐటీ ఇండెక్స్‌ బాగా పడిపోవడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు నష్టా‍ల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:23 సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్ల నష్టంతో 35,061 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 10,564 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ-50లో హిందుస్తాన్‌ పెట్రోలియం 9 శాతానికి పైగా ఎగసింది. బీపీసీఎల్‌, ఐఓసీ షేరు​7 శాతానికి పైగా పెరిగాయి. ఏసియన్‌ పెయింట్స్‌

Most from this category