News


డిసెంబరు 2 నుంచి ఇండియా జాయ్‌

Wednesday 21st November 2018
news_main1542775221.png-22239

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: గేమింగ్‌, డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ రంగంలో ఆసియాలో భారీ ప్రదర్శన, సదస్సుకు హైదరాబాద్‌ వేదికవుతోంది. ఇండియా జాయ్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, గేమింగ్‌ అసోసియేషన్‌ (త్వాగా) సహకారంతో డిసెంబరు 2 నుంచి 6 వరకు హెచ్‌ఐసీసీ, హైటెక్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ సంస్థలు,  స్టూడియోలు, కంటెంట్‌ డెవలపర్స్‌, హార్డ్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, కస్టమర్లు, విద్యార్థులు దీనికి హాజరవుతారని త్వాగా ప్రెసిడెంట్‌, గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్స్‌ సీఈవో రాజీవ్‌ చిలక మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. 50 దేశాల నుంచి 500 మంది స్పీకర్లు పాల్గొంటారని త్వాగా వైస్‌ ప్రెసిడెంట్‌, పర్పుల్‌ టాక్‌ సీఈవో శ్రీధర్‌ ముప్పిడి చెప్పారు. కొన్ని సమావేశాలకు ఉచితంగా హాజరు కావచ్చని, కొన్నింటికి మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన.



You may be interested

యూఎస్‌లో మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌

Wednesday 21st November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మిల్క్‌షేక్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ ఫుడ్‌ స్టార్టప్‌ ‘మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌’ యూఎస్‌లో అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో తొలి స్టోర్‌ను తెరిచింది. కెనడా, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాంచైజీల కోసం ఎంక్వైరీలు వస్తున్నాయని మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌ ఫౌండర్‌ రాహుల్‌ తిరుమలప్రగడ మంగళవారం చెప్పారు. ‘‘ఆయా దేశాల్లో మార్చికల్లా ఔట్‌లెట్లను తెరుస్తాం. హైదరాబాద్‌ సహా దక్షిణాదిన మొత్తం 80 స్టోర్లున్నాయి. 2019 చివరినాటికి దేశవ్యాప్తంగా 200

నాలుగు కెమెరాల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్... తాజాగా గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 6జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వెర్షన్లలో లభించే ఫోన్ల ధర దీని ధర వెర్షన్‌ను బట్టి రూ.36,990- రూ.39,900గా ఉంది. వెనుకవైపున నాలుగు కెమెరాలు ఉండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ (512 జీబీ దాకా పెంచుకోవచ్చు), 3,800 ఎంఏహెచ్‌

Most from this category