STOCKS

News


గెయిల్‌ లాభం రూ.1,259 కోట్లు

Saturday 11th August 2018
news_main1533957036.png-19156

న్యూఢిల్లీ: నేచురల్‌ గ్యాస్‌ను మార్కెటింగ్‌ చేసే అతిపెద్ద దేశీ కంపెనీ గెయిల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,026 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,259 కోట్లకు పెరిగిందని గెయిల్‌ తెలిపింది. గ్యాస్‌ ట్రేడింగ్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాల్లో మంచి మార్జిన్లు సాధించడంతో ఈ క్యూ1లో నికర లాభం ఈ  స్థాయిలో పెరిగిందని గెయిల్‌ ఇండియా సీఎమ్‌డీ, బి.సి.త్రిపాఠి చెప్పారు. అమ్మకాలు 50 శాతం వృద్ధితో రూ.17,262 కోట్లకు పెరిగాయని తెలియజేశారు. గత క్యూ1లో రూ.2,015 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం ఈ క్యూ1లో 17 శాతం వృద్ధితో రూ.2,363 కోట్లకు పెరిగిందని త్రిపాఠి పేర్కొన్నారు. గ్యాస్‌ ట్రేడింగ్‌ స్థూల లాభం 64 శాతం వృద్ధితో రూ.551 కోట్లకు, పెట్రోకెమికల్‌ వ్యాపారం స్థూల లాభం ఐదింతలు పెరిగి రూ.208 కోట్లకు చేరిందని వివరించారు. 
ఈ ఆర్థిక సంవత్సం తొలి త్రైమాసిక కాలంలో ఆర్థిక పనితీరు బాగానే ఉండటం కాక, కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకున్నామని త్రిపాఠీ తెలియజేశారు. కోల్‌కతాలో సిటీ గ్యాస్‌ నెట్‌వర్క్‌ నిర్వహణ కోసం గ్రేటర్‌ కోల్‌కతా గ్యాస్‌ సప్లై కార్పొరేషన్‌తో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. ధామ్ర ఎల్‌ఎన్‌జీ టెర్మిన్‌తో టోలింగ్‌ అగ్రిమెంట్‌ను కూడా కుదుర్చుకున్నామని వెల్లడించారు. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌(సీజీడీ) వాణిజ్య కార్యకలాపాలు వారణాసి, కటక్‌ల్లో ఆరంభించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గెయిల్‌ ఇండియా షేర్‌ బీఎస్‌ఈలో 3.4 శాతం నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. 
 



You may be interested

జూలైలో వాహన విక్రయాలకు బ్రేకులు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల జోరుకు బ్రేకులు పడ్డాయి. గడిచిన తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో అమ్మకాలు క్షీణించాయి. గతేడాది జూలైలో జీఎస్‌టీ అమలు కారణంగా భారీ విక్రయాలు నమోదు కావటంతో ఈ సారి అప్పటితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం జూలైలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 2,90,960 యూనిట్లకు తగ్గాయి. గతేడాది జూలైలో అమ్మకాలు 2,99,066

రెట్టింపైన హిందాల్కో లాభం

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో... స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.734 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.364 కోట్లుగా  కోట్లతో పోల్చితే 102 శాతం వృద్ధి సాధించామని హిందాల్కో తెలిపింది. ఇబిటా  అధికంగా ఉండటం, తక్కువ వడ్డీ వ్యయాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

Most from this category