STOCKS

News


గెయిల్‌ చేతికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పవన విద్యుత్తు వ్యాపారం?

Saturday 17th November 2018
news_main1542431973.png-22113

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన పవన విద్యుదుత్పత్తి విభాగాన్ని కొనుగోలు చేయాలని గెయిల్‌ ఇండియా యోచిస్తోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎల్‌ఎల్‌) గ్రూప్‌ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో డీఫాల్ట్‌ అయి, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో కుదుపులకు కారణమైన విషయం తెలిసిందే. ఈ ​గ్రూప్‌లో భాగమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌కు చెందిన 775 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని గెయిల్‌ భావిస్తోంది. ఈ విషయమై గెయిల్‌ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను సంప్రదించిందని సమాచారం. ఈ సంప్రదింపులు ప్రాధమిక స్థాయిలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌ సాకారమైతే, నిదుల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు  కొంత ఊరట లభిస్తుందని, మరోవైపు గెయిల్‌కు కూడా ప్రయోజనకరమేనని నిపుణులంటున్నారు. ఈ వార్తలపై ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కాగా గెయిల్‌ కంపెనీ వద్ద రూ.3,240 కోట్ల విలువైన నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని అంచనా.  


 



You may be interested

డీఎస్‌పీ నుంచి హెల్త్‌కేర్‌ ఫండ్‌

Saturday 17th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ తాజాగా హెల్త్‌కేర్‌కి సంబంధించి కొత్త ఫండ్‌ ఆఫర్‌ను ఆరంభించింది.  నవంబర్‌ 12న ప్రారంభమైన ఈ ఫండ్‌ ఆఫర్‌ వ్యవధి నవంబర్‌ 26 దాకా ఉంటుంది. ఈ ఫండ్‌ సుమారు రూ.500 కోట్ల దాకా పెట్టుబడులు (ఏయూఎం) సమీకరించే అవకాశం ఉందని ఫండ్‌ మేనేజర్‌ ఆదిత్య ఖేమ్కా శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ ఫండ్‌ సుమారు 20–25 హెల్త్‌కేర్, ఫార్మా

ఇండియన్‌ కంపెనీల ఏడీఆర్‌లు అక్కడక్కడే..

Saturday 17th November 2018

నిలకడగా ఇన్ఫోసిస్‌, వేదాంత ఏడీఆర్‌లు 1 శాతానికి పైగా పెరిగిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌  అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, వేదాంత ఏడీఆర్‌లు నిలకడగా ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు స్వల్పంగా తగ్గాయి.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.08 శాతం తగ్గుదలతో

Most from this category