STOCKS

News


గెయిల్‌ లాభం 55% జంప్‌

Monday 5th November 2018
news_main1541410413.png-21723

గెయిల్‌ ఇండియా తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 55 శాతం వృద్ధితో రూ.1,963 కోట్లకు ఎగసింది. మంచి నిర్వహణ పనితీరు ఇందుకు కారణం. మార్కెట్‌ నిపుణులు కంపెనీ నికర లాభం రూ.1,473 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అంటే కంపెనీ నికర లాభం అంచనాలు మించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,259 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఆదాయం 55.3 శాతం వృద్ధితో రూ.19,275 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం లేదా ఈబీటా 29 శాతం వృద్ధితో రూ.2,270 కోట్ల నుంచి రూ.2,928 కోట్లకు పెరిగింది. ఈబీటా మార్జిన్లు రూ.7.3 శాతం నుంచి 15.2 శాతానికి చేరాయి. 

కాగా క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో గెయిల్‌ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో మధ్యహ్నం 2:56 సమయంలో 0.27 శాతం పెరుగుదలతో రూ.370 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ద్రవ్యకొరతతో హౌసింగ్‌ ఫైనాన్స్ షేర్ల పతనం

Monday 5th November 2018

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ద్రవ్యత్వ కొరత అంశం మరోసారి తెరపైకి రావడంతో  సోమవారం ఆ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ కొరత ఇంకా తీరలేదని కార్పోరేట్‌ అఫైర్స్‌ సెక్రటరీ సోమవారం తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణం ఇచ్చే విషయంలో ఆర్‌బీఐ కొంత నిబంధనలను సడలించినప్పటికి బ్యాంకులు మాత్రం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రుణాల కేటాయింపు విషయంలో వెనకడుగు వేస్తన్నట్లు ఆయన తెలిపారు. ఈ కారణంగా ఎన్‌బీఎఫ్‌సీ

డబ్బు ఒక్కటే కాదు.. ధైర్యం కావాలి..!

Monday 5th November 2018

ప్రముఖ వాల్యూ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా వ్యాఖ్య న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో సంపాదించాలి అంటే.. కేవలం పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదని, అందుకు సరిపడా గుండె ధైర్యం కూడా అవసరమని ప్రముఖ వాల్యూ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా వ్యాఖ్యానించారు. దీపావళి పండుగ సందర్భంగా ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. మార్కెట్‌ పని చేసే విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ సంపాదించడానికి అవకాశం

Most from this category