News


వాణిజ్య ఉద్రిక్తతలు ... ప్రపంచ ఆర్థికానికి ముప్పు

Monday 10th June 2019
news_main1560152028.png-26194

  • జీ 20 ప్రకటన

ఫుకోవా (జపాన్‌): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీత్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కారం కావాల్సిన అవసరాన్ని బలంగా చెప్పింది. జపాన్ పోర్ట్‌ పట్టణం ఫుకోవాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒక్కతాటిపై నిలవగా, అమెరికా మాత్రం వేరుగా వ్యవహరించింది. ప్రతీ ఒక్కరు వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వృద్ధికి ముప్పుగా అభిప్రాయపడినట్టు, అమెరికా యంత్రాంగంలో ఈ తరహా భావన లేదని ఈయూ ఆర్థిక, మానిటరీ వ్యవహారాల కమిషనర్‌ పీరే మోస్కోవిసి తెలిపారు.



You may be interested

ఆధార్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.2లక్షల రుణం

Monday 10th June 2019

ప్రభుత్వరంగ సంస్థలకు ‍స్వయంప్రతిపత్తి మోదీ సర్కారుకు అనిల్‌ అగర్వాల్‌ సూచనలు న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కీలక సూచనలు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని, ఆధార్‌ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.2లక్షల చొప్పున రుణం ఇవ్వాలని ప్రధానంగా సూచించారు. దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థలు మూడు

సెన్సెక్స్‌ తక్షణ అవరోధం 40,030

Monday 10th June 2019

మార్కెట్‌ అంచనాల్ని మించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిప్పటి నుంచి స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నప్పటికీ, ఆ రికార్డుస్థాయికి ఒక్కరోజుకూడా నిలుపుకోలేక అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు దఫాలు రికార్డుస్థాయికి చేరిన తర్వాత వెనువెంటనే 2-3 శాతం మేర పతనాల్ని చవిచూసాయి. గతవారం రిజర్వుబ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత కూడా ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం మార్కెట్‌ క్షీణతకు కారణమయ్యింది. ఇదేతరహా

Most from this category