STOCKS

News


ద్వితీయార్థంలో ఆటో అమ్మకాల్లో వృద్ధి!

Friday 22nd February 2019
Markets_main1550826723.png-24279

  • ఇండియా రేటింగ్స్‌ అంచనా

న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాలు.. 2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనావేసింది. గత పదినెలల్లో 4 శాతం వృద్ధికే పరిమితమైన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక మోస్తరుగా ఉండేందుకు అవకాశం ఉందని అంచనాకట్టింది. బీఎస్‌-సిక్స్‌ నిబంధనల కారణంగా ప్రథమార్థంలో ఈ పరిస్థితి ఉండనున్నప్పటికీ.. గ్రామీణ మధ్యతరగతి జనాభా ఆదాయం పెరుగుతుండడం, రహదారుల అభివృద్ధి, ఎన్‌బీఎఫ్‌సీలో ద్రవ్యలభ్యత పెరగడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో పీవీ అమ్మకాలు ద్వితీయార్థంలో పెరగనున్నట్లు అంచనావేసింది. 2018-19 ఏడాదిలోని 10 నెలల్లో 23 శాతం వృద్ధిరేటును నమోదుచేసిన వాణిజ్య వాహన అమ్మకాలు 2019-20 ఏడాదిలో తగ్గేందుకే ఆస్కారం ఉందని వివరించింది. ద్విచక్ర వాహన అమ్మకాలు 8 శాతం వృద్ధిరేటును నమోదుచేయగా, రానున్నకాలంలో కూడా ఇదే తరహా వృద్ధికి అవకాశం ఉన్నట్లు తెలిపింది.



You may be interested

డేటా వినియోగానికి 4జీ ఊతం

Friday 22nd February 2019

- 2018లో 109 శాతం వృద్ధి - నోకియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: 4జీ టెక్నాలజీ రాకతో దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఏకంగా 109 శాతం మేర వృద్ధి చెందింది. దేశీయంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌కి (ఎంబీఐటీ) సంబంధించి నోకియా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి నెలకు ప్రతి యూజరు వినియోగించే డేటా పరిమాణం సగటున 10 గిగాబైట్స్ (జీబీ)

శామ్‌సంగ్‌... ఫోల్డ్‌ చేసే ఫోను

Friday 22nd February 2019

ధర రూ.1.4 లక్షలు శాన్ ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌.. అధునాతన టెక్నాలజీతో తన మొట్ట మొద‌టి మడత పెట్టగల (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ఫోల్డ్‌’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ నుంచి వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇది ట్యాబ్‌గా, ఫోన్‌గా కూడా ఉపయోగపడనుందని కంపెనీ వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేయగలిగిన ఈ మొబైల్‌ డిస్‌ప్లే సైజ్ 4.6

Most from this category