STOCKS

News


4 శాతం తగ్గిన ఫ్యూచర్‌ రిటైల్‌ లాభం

Friday 10th August 2018
news_main1533896766.png-19132

 న్యూఢిల్లీ: బిగ్‌బజార్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌లను నిర్వహించే ఫ్యూచర్‌ రిటైల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.153 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.148 కోట్లతో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఫ్యూచర్‌ రిటైల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,707 కోట్ల నుంచి రూ.4,542 కోట్లకు తగ్గిందని పేర్కొంది. గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున ఈ ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదని వివరించింది. కాగా నాన్-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాజన్‌ భారతీ మిట్టల్‌ కంపెనీకి రాజీనామా చేశారు. అదనపు (నాన్‌-ఎగ్జిక్యూటివ్‌) డైరెక్టర్‌గా రాహుల్‌ గార్గ్‌ను నియమించారు. 2015లో భారతీ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌ వ్యాపార చైన్‌ ‘ఈజీ డే’ను ఫ్యూచర్‌ గ్రూప్‌లో విలీనం చేశాక ఆయన ఫ్యూచర్‌ రిటైల్‌ బోర్డ్‌లోకి వచ్చారు. ఈ మధ్యే ఆ వాటాలో సగాన్ని భారతీ గ్రూపు రూ.1,697 కోట్లకు విక్రయించింది కూడా. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు 1 శాతం నష్టంతో రూ.515 వద్ద ముగిసింది. 



You may be interested

ఐషర్‌ మోటార్స్‌ లాభం రూ.576 కోట్లు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఐషర్‌ మోటార్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.576 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.460 కోట్లతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.2,255 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.2,548 కోట్లకు పెరిగింది.

ఐపీవోకు దొడ్ల డెయిరీ

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కంపెనీ దొడ్ల డెయిరీ ఐపీవోకు రానుంది. ఈ మేరకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా  రూ.150 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితోపాటు కంపెనీ షేర్‌హోల్డర్లు టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌, దొడ్ల దీపా రెడ్డి 95,43,770 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఐపీవో సైజు సుమారు

Most from this category