STOCKS

News


ఫ్యూచర్‌ వ్యాపారం.. రూ.40లకే భోజనం

Saturday 12th January 2019
Markets_main1547271106.png-23542

- రూ.40కే భోజనం
- సొంత వంటశాలల నుంచి డెలివరీలు

పంజాబ్‌: ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి ఫ్యూచర్‌ గ్రూప్‌ అడుగుపోడుతోంది. భోజనప్రియులకు సరసమైన ధరలకే నోరూరించే వంటకాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ వెల్లడించింది. సొంత వంటశాలలను ఏర్పాటు చేసి.. ఇక్కడ నుంచి రూ.40కే భోజనం, రూ.10కే రెండు సమోసాలను అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ కిషోర్ బీయానీ తెలియజేశారు. ఫ్యూచర్‌పే యాప్‌ ద్వారా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తామని వెల్లడించిన ఆయన.. హోటల్‌ ఏర్పాటు లేదని, కేవలం డోర్‌ డెలివరీలు మాత్రమే ఉంటాయని స్పష్టంచేశారు. ‘తధాస్తు’ పేరిట యాప్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటుచేయడం ద్వారా ఈ సేవలను ప్రారంభించనున్నామని తెలిపారు. తమ బ్రాండ్‌ బియ్యం, గోదుమ పిండి వినియోగం పెంచడంలో ఈ క్లౌడ్ కిచెన్‌ కాన్సెప్ట్‌ సహకరించనుందన్నారు. ‘ఇప్పటివరకు ఫ్యాషన్‌పైన దృష్టి సారించాం. ఇక నుంచి ఆహార వ్యాపారంపై ఫోకస్‌ పెంచుతున్నాం. దీర్ఘకాలంలో ఈ విభాగం ద్వారా 50-60 శాతం అమ్మకాలను అంచనావేస్తున్నాం. వంటకు అవసరమైన అన్ని పదార్ధాలను గ్రూప్‌నకు చెందిన ఫ్యాక్టరీల నుంచే సమకూర్చుకుంటాం. ఒకవేళ ఇతరులు ఎవరైన మార్జిన్లు అధికంగా ఇస్తే అక్కడ నుంచి తీసుకుంటాం.’ అని వెల్లడించారు.



You may be interested

ఈ ఏడాది సాయం 4.5 బిలియన్‌ డాలర్లు

Saturday 12th January 2019

- దీన్లో 3.5 బిలియన్‌ డాలర్లు ప్రభుత్వానికి - మరో బిలియన్‌ డాలర్లు ప్రయివేటు రంగానికి  భారత్‌పై ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రకటన - రైతు రుణ మాఫీ సరైన పరిష్కారం కాదని అభిప్రాయం న్యూఢిల్లీ: భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్‌ డాలర్లకు (రూ.31,500 కోట్లు) పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, వచ్చే

ఇన్ఫీ అంచనాలు మిస్‌..!

Saturday 12th January 2019

- క్యూ3లో లాభం 30 శాతం డౌన్‌ - రూ.3,610 కోట్లకు పరిమితం - 20 శాతం పెరిగి రూ.21,400 కోట్లకు ఆదాయం - రూ.4 స్పెషల్‌ డివిడెండ్‌ న్యూఢిల్లీ: రికార్డు లాభాలతో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల (క్యూ3) సీజన్‌కు శుభారంభాన్నివ్వగా.. రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం ఆదాయం 20 శాతం ఎగిసినప్పటికీ ... నికర

Most from this category