STOCKS

News


డేటా వినియోగానికి 4జీ ఊతం

Friday 22nd February 2019
news_main1550827230.png-24281

- 2018లో 109 శాతం వృద్ధి
- నోకియా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: 4జీ టెక్నాలజీ రాకతో దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఏకంగా 109 శాతం మేర వృద్ధి చెందింది. దేశీయంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌కి (ఎంబీఐటీ) సంబంధించి నోకియా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి నెలకు ప్రతి యూజరు వినియోగించే డేటా పరిమాణం సగటున 10 గిగాబైట్స్ (జీబీ) స్థాయికి చేరింది. అయితే, అదే సమయంలో 3జీ డేటా ట్రాఫిక్ స్వల్పంగా తగ్గింది. గతేడాది ఆఖరు నాటికి 3జీ యూజర్లతో పోలిస్తే 4జీ యూజర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉందని అధ్యయన నివేదికలో వెల్లడైంది. "టారిఫ్‌లు తగ్గడం, 4జీ డివైజ్‌లు అందుబాటు ధరల్లో లభిస్తుండటం తదితర అంశాల కారణంగా 4జీ యూజర్ల సంఖ్య 137 శాతం ఎగిసింది. 3జీ నుంచి 4జీ డివైజ్‌లకు మారే వారి సంఖ్య పెరగడం కూడా 4జీ డేటా ట్రాఫిక్ పెరగడానికి కారణం" అని నివేదిక పేర్కొంది. దేశీయంగా అత్యధిక శాతం మంది తొలిసారిగా బ్రాడ్‌బ్యాండ్‌ను వినియోగిస్తుండటం, దీనితో ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం వంటి అంశాలు 4జీ విస్తృతికి తోడ్పడుతున్నాయి. వీడియో స్ట్రీమింగ్‌, మీడియా యాప్స్‌ కారణంగా చిన్న పట్టణాలు, నగరాల్లో 4జీ డేటా వినియోగం అత్యధికంగా పెరిగింది. 


మరికొన్నేళ్లు ఇదే ధోరణి..
దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్ విస్తృతి ఇప్పటికీ కేవలం 45 శాతం మాత్రమే ఉందని, ఈ నేపథ్యంలో డేటా వినియోగం రాబోయే మరికొన్నేళ్ల పాటు గణనీయంగా పెరగడం కొనసాగవచ్చని నోకియా భారత మార్కెట్ విభాగం హెడ్ సంజయ్ మాలిక్ చెప్పారు. టెలికం సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీసులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 5జీ సేవలకు కూడా ఉపయోగపడేలా టెల్కోలు తమ 4జీ నెట్‌వర్క్‌ సామర్ధ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు.

 



You may be interested

ఆదాయంపై భరోసా ఇస్తేనే ఆర్థిక సాయం..

Friday 22nd February 2019

- బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు తేల్చి చెప్పిన డీసీసీ న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన సహాయం పొందాలంటే సరైన టర్న్‌ అరౌండ్ వ్యూహాన్ని సమర్పించాలని, ఆదాయ వృద్ధిపై భరోసానివ్వాలని ప్రభుత్వ రంగ టెల్కోలు బీఎస్‌ఎన్ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) స్పష్టం చేసింది. "ఆర్థిక సహాయం గానీ అందజేస్తే... ఈ రెండు కంపెనీలూ మళ్లీ ఎప్పటికల్లా లాభాల్లోకి వస్తాయి? అందుకోసం ఏయే వ్యూహాలు అమలు చేయాలనుకుంటున్నాయి? వంటి వివరాలు చెప్పాలని

ద్వితీయార్థంలో ఆటో అమ్మకాల్లో వృద్ధి!

Friday 22nd February 2019

ఇండియా రేటింగ్స్‌ అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాలు.. 2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనావేసింది. గత పదినెలల్లో 4 శాతం వృద్ధికే పరిమితమైన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక మోస్తరుగా ఉండేందుకు అవకాశం ఉందని అంచనాకట్టింది. బీఎస్‌-సిక్స్‌ నిబంధనల కారణంగా ప్రథమార్థంలో ఈ పరిస్థితి ఉండనున్నప్పటికీ.. గ్రామీణ

Most from this category