మన్‌పసంద్ బేవరేజేస్‌లో తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల వాటా
By Sakshi

న్యూఢిల్లీ: మన్‌పసంద్ బేవరేజేస్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తమ వాటాను తగ్గించుకున్నాయి.. ఈ ఏడాది మార్చి నాటికి 21.56 శాతంగా ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)ల వాటా ఈ ఏడాది జూన్ నాటికి 13.35 శాతానికి తగ్గింది. నొముర గ్రూప్ 4.86 శాతం వాటాను, పార్వెస్ట్ ఈక్విటీ 1.07 శాతం వాటాను విక్రయించడం ద్వారా మన్‌పసంద్ బేవరేజేస్ నుంచి వైదొలిగాయి. మరో ఎఫ్‌పీఐ సంస్థ, ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ తన వాటాను 4.97 శాతం నుంచి 3.62 శాతానికి తగ్గించుకుంది. మన్‌పసంద్ బేవెరేజేస్ కంపెనీకి ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ సంస్థ రాజీనామా చేయడంతో గత నెలలో మన్‌పసంద్ బేవరేజేస్ షేర్ 60 శాతం వరకూ పతనమైంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో మన్‌పసంద్ బేవరేజేస్ షేర్ 5 శాతం నష్టపోయి రూ. 151 వద్ద ముగిసింది.
You may be interested
స్టాక్ ఎంపికకు మార్కెట్ క్యాప్‌తో పనేంటి?
Tuesday 10th July 2018మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ ఏడాది ధరల పరంగా ఎక్కువ దిద్దుబాటుకు గురయ్యాయి. అంతకుముందు వరుసగా మూడేళ్ల పాటు ఇవి భారీ ర్యాలీ చేశాయి మరి. కార్పొరేట్ గవర్నెన్స్ అంశాలు, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, ఎఫ్ఐఐల అమ్మకాలు ఇలా ఎన్నో అంశాలు కరెక్షన్ వెనుక ఉన్నాయి. కొనుగోలుకు మంచి అవకాశంగా భావించిన మార్కెట్ పార్టిసిపెంట్స్ మాత్రం బాగా పడిపోయిన స్మాల్, క్యాప్ స్టాక్స్‌లో విలువైన వాటి కోసం
ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్ !
Tuesday 10th July 2018న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశిస్తున్న ఎల్ఐసీ... ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఇటీవలనే ఎల్ఐసీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం కూడా పొందిన తర్వాత ఓపెన్ ఆఫర్‌కు అనుమతించాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీని ఎల్ఐసీ కోరవచ్చని