STOCKS

News


భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ సింఘాల్‌ అరెస్ట్‌

Friday 10th August 2018
news_main1533897930.png-19146

న్యూఢిల్లీ: భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఓ (సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌) అరెస్ట్‌ చేసింది. రూ.2,000 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన కేసులో ఆయన నిందితుడు. సంస్థ నిధుల అవకతవకలకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐఓ అరెస్ట్‌ చేసిన మొట్టమొదటి వ్యక్తి సింఘాల్‌ అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. భూషణ్‌ స్టీల్‌కు అనుబంధంగా ఉన్న వివిధ కంపెనీల్లో వినియోగానికి గాను పొందిన రూ.2,000 కోట్ల విషయంలో సింఘాల్‌ అవకతవకలకు పాల్పడ్డారని ఆర్థికశాఖ పేర్కొంటోంది. బ్యాంకులు దివాలా ప్రక్రియను ప్రారంభించిన 12 బడా కేసుల్లో భూషణ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ఒకటి. ఎన్‌సీఎల్‌టీ ముందు చేరిన ఈ కంపెనీని ఇటీవలే టాటా స్టీల్‌ బిడ్‌ వేసి దక్కించుకుంది. 



You may be interested

వాల్యూ స్టాకులనే నమ్ముకోండి!

Friday 10th August 2018

పొరింజు సూచన మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ మూడు నాలుగేళ్లు నిర్విరామంగా ర్యాలీ జరిపాయని, దీంతో వాటి వాల్యూషన్లు చాలా ఎక్కువగా పెరిగాయని, అందుకే ఈ ఏడాది ఇవన్నీ పతనం చవిచూశాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ చెప్పారు. చిన్న స్టాకులు సత్తా చూపినన్ని సంవత్సరాలు బ్లూచిప్స్‌ పెద్దగా పరుగు తీయలేదని, ఇప్పుడిప్పుడే ఇవి అప్‌మూవ్‌లోకి పయనిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం చిన్న, మిడ్‌క్యాప్‌ స్టాకుల వాల్యూషన్లు దిగివచ్చాయన్నారు. ఈ సమయంలో వాల్యూస్టాకులను ఎంచుకొని పెట్టుబడులు

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం 50 శాతం అప్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 50 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.170 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.256 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,160 కోట్ల నుంచి రూ.1,616 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సంజయ గుప్తా తెలియజేశారు. వడ్డీ ఆదాయం 28 శాతం

Most from this category