STOCKS

News


రేపట్నుంచి ఫోర్డ్ మెగా సేల్స్‌ కార్యక్రమం

Thursday 6th December 2018
news_main1544075049.png-22685

హైదరాబాద్:  ‍ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ డిసెంబర్ 7 నుంచి 9 దాకా 'మిడ్‌నైట్ సర్‌ప్రైజ్'  పేరిట మెగా సేల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 11 కోట్ల విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు సంస్థ తెలిపింది. దీన్ని పురస్కరించుకుని తమ షోరూమ్‌లు ఉదయం 9 గం.ల. నుంచి అర్ధరాత్రి దాకా తెరిచే ఉంటాయని సంస్థ మార్కెటింగ్ ఈడీ వినయ్ రైనా తెలిపారు. ఫోర్డ్ కారు కొనుగోలు చేసే వారికి స్క్రాచ్‌ కార్డు లభిస్తుందని, నెలరోజుల్లోగా వాహన డెలివరీతో పాటు కచ్చితమైన గిఫ్ట్‌ను కూడా అందజేయడం జరుగుతుందని వివరించారు. బహుమతుల్లో ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్ల నుంచి ఐప్యాడ్‌లు, ప్యారిస్‌ ట్రిప్ దాకా ఉన్నాయి. జనవరి 22న లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బంపర్ ప్రైజ్ కింద ఫోర్డ్ ఫిగో లభించనుంది. 



You may be interested

ఈ ఏడాది 1.75 లక్షల యూనిట్లు

Thursday 6th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో 1.75 లక్షల త్రిచక్ర వాహనాలు అమ్ముడవుతాయని పియాజియో ఆశాభావంతో ఉంది. కంపెనీ గతేడాది 1.55 లక్షల యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ దేశంలో మొదటి రెండు స్థానాల్లో పోటీపడుతుందని పియాజియో రీజినల్‌ మేనేజర్‌ బిజు సుకుమారన్‌ బుధవారం తెలిపారు. ఇక్కడి మార్కెట్లో నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేసిన సందర్భంగా వరిష్ట మోటార్స్‌ ప్రొప్రైటర్‌ అభిషేక్‌ తోష్నివాల్‌, వర్దమాన్‌

థియేటర్లలో నో లైట్స్‌ ఆఫ్‌!

Thursday 6th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిత్ర పరిశ్రమలో కొత్త శకం ప్రారంభమైంది. ఇక థియేటర్‌లో సినిమా చూడాలంటే లైట్లు ఆపేయాల్సిన అవసరం లేదు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ ‘ఓనిక్స్‌’ పేరిట ఎల్‌ఈడీ తెరలను అభివృద్ధి చేసింది. అమెరికా, మెక్సికో, థాయ్‌ల్యాండ్, చైనా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్లను తొలిసారిగా మన దేశంలో విడుదల చేసింది. మల్టిప్లెక్స్‌ ఆపరేటర్‌ ఐనాక్స్‌ లీజర్స్‌తో ఒప్పందం చేసుకొని బుధవారం

Most from this category