STOCKS

News


ఫుడ్‌పాండా చేతికి హోలాషెఫ్‌

Wednesday 17th October 2018
news_main1539750552.png-21230

 హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ కంపెనీ ఫుడ్‌పాండా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్‌టెక్‌ కంపెనీ హోలాషెఫ్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫుడ్‌పాండా సొంత క్లౌడ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కేటగిరీల్లో సొంత బ్రాండ్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగుమమైందని ఫుడ్‌పాండా ఇండియా సీఈఓ ప్రణయ్‌ జీవ్‌రాజ్కా తెలిపారు. హోలాషెఫ్‌ కొనుగోలుతో కస్టమర్ల ఆహార అభిరుచులు, ఇష్టాలు తెలుస్తాయని... దీంతో సొంత బ్రాండ్‌కు అవకాశముంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. హోలాషెఫ్‌ కిచెన్స్, ఫుడ్‌ ఉపకరణాలతో పాటూ ఉద్యోగులు కూడా ఫుడ్‌పాండాలో భాగస్వామ్యమైపోతారని చెప్పారు. ప్రస్తుతం ఫుడ్‌పాండాలో 25 వేలకు పైగా రెస్టారెంట్లు నమోదయ్యాయి. రోజుకు 3 లక్షల ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయి.
 



You may be interested

సెకురా ఎనర్జీకి ఎస్సెల్‌ గ్రూపు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు

Wednesday 17th October 2018

ముంబై: ఎడెల్వీజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధ్వర్యంలోని సెకురా ఎనర్జీ, ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన నాలుగు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులను రూ.6,000 కోట్లతో సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో రెండు నిర్వహణలోని ప్రాజెక్టులు కాగా, రెండు నిర్మాణంలో ఉన్నవి. కార్యకలాపాలు నిర్వహించే వాటిలో దర్భంగా-మోతిహరి ట్రాన్స్‌మిషన్‌, ఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ XXXI (B) ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న రెండు ప్రాజెక్టులు 2020 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలు ఆరంభించనున్నాయి. సెకురా ఎనర్జీని ఎడెల్వీజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

మార్కెట్‌ క్యాప్‌లో రిలయన్సే నంబర్‌1

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి మార్కెట్‌ క్యాప్‌లో దేశంలోనే నంబర్‌ 1 కంపెనీగా నిలిచింది. మంగళవారం ఆర్‌ఐఎల్‌ షేరు 2.09 శాతం పెరిగి రూ.1,163.65 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. టీసీఎస్‌ షేరు 0.64 శాతం లాభంతో 1,961.70 వద్ద స్థిరపడింది. క్లోజింగ్‌ ధర ప్రకారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,37,576.57 కోట్లుగా ఉంది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,36,105.31 కోట్లు. టీసీఎస్‌ కంటే ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.1,471.26 కోట్లు

Most from this category