News


ఎఫ్‌ఎల్‌ఓ కొత్త కార్యవర్గం ఎన్నిక

Friday 26th April 2019
news_main1556255376.png-25362

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) హైదరాబాద్‌ మహిళ సమాఖ్య (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓలకు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఎఫ్‌ఎల్‌ఓకు సోనా చట్వానీ, యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓకు శిల్పా దాట్ల చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఏడాది పాటు వీళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సోనా చట్వానీ మాట్లాడుతూ.. కేంద్ర ఫిక్కీ మహిళా విభాగం అడుగుజాడల్లో నడుస్తామని, మహిళా సాధికారిత కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. మహిళల్లో నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు



You may be interested

20 శాతం పెరిగిన ఎస్‌బీఐ లైఫ్‌ లాభం

Friday 26th April 2019

మార్చి క్వార్టర్లో రూ.458 కోట్లు న్యూఢిల్లీ: ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం మార్చి త్రైమాసికంలో 20 శాతం వృద్ధి సాధించింది. రూ.457 కోట్లకు పైగా లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. ఆదాయం సైతం 50 శాతానికి పైగా పెరిగి రూ.15,601 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.381 కోట్లు, ఆదాయం రూ.10,052 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ

హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు మ్యాక్స్‌బూపా డిజిటల్‌ ఉత్పత్తులు

Friday 26th April 2019

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు మ్యాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సమగ్రమైన, ప్రత్యేకమైన వైద్య బీమా ఉత్పత్తులను అందించనుంది. ఏనీటైమ్‌ హెల్త్‌ మెషిన్‌ పేరుతో డిజిటల్‌ టచ్‌ పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌బ్యాంకింగ్‌, డిజిటల్‌ సెల్లర్‌ యాప్‌ ఇన్‌స్టాఇన్‌ష్యూర్‌ రూపంలో ఈ సేవలను ఆఫర్‌ చేయనుంది. ఈ మేరకు మ్యాక్స్‌బూపా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మధ్య కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదిరింది.

Most from this category