STOCKS

News


ఆన్‌లైన్‌ కిరాణాపై ఫ్లిప్‌కార్ట్‌ దృష్టి

Friday 10th August 2018
news_main1533896956.png-19134

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి కిరాణా సరుకుల మార్కెట్‌పై దృష్టిసారించింది. ‘నియర్‌బై’ పేరుతో అక్టోబరు 2015లో ఈ-గ్రోసరీ యాప్‌ను ప్రారంభించి కొన్ని నెలల కాలంలోనే ఈ వ్యాపారాన్ని మూసివేసిన ఈ ఆన్‌లైన్‌ సంస్థ.. అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌ వంటి బడా సంస్థలకు పోటీనివ్వడం కోసం మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరులో ఆన్‌లైన్‌ కిరాణాపై పట్టు సాధించిన ఫ్లిప్‌కార్ట్‌, ఈ విభాగంలో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్ని ప్రధాన నగరాల్లో 5 నుంచి 6 వరకు ఈ- గ్రోసరీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు అత్యధిక శాతం అసంఘటిత రంగంలోనే ఉన్న ఆన్‌లైన్‌ కిరాణా మార్కెట్‌పై సంఘటిత సంస్థలు పట్టు పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ ఏడాది మేలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌... తన ‘అమెజాన్‌ నౌ’ గ్రోసరీ సేవల్ని రీ బ్రాండింగ్‌ చేసింది. ఇక యాప్‌ ద్వారా మాత్రమే అందిస్తున్న ‘ప్రైమ్‌ నౌ’ సేవలు బెంగుళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లలో అందుబాటులో ఉన్నాయి. కిరాణా మార్కెట్‌లో కేవలం 0.5 శాతంగానే ఉన్నటువంటి ఆన్‌లైన్‌ వ్యాపారంలో పాగా వేసేందుకు దాదాపుగా అన్ని బడా సంస్థలు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. ‘‘గ్రోసరీ మార్కెట్‌ విషయానికొస్తే ఈ-కామర్స్‌ ద్వారా దీనికింకా సరైన పరిష్కార దొరికినట్లు భావించలేం. మా సూపర్‌మార్ట్‌ ద్వారా సరైన నాణ్యత, చౌక ధర, వెసులుబాటు ఉండేలా చూస్తున్నాం. స్పందన చాలా బాగుంది. వచ్చేనెల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి భారీ ప్రణాళికలు వేస్తున్నాం’’ అని ఫ్లిప్‌కార్ట్‌ గ్రోసరీస్‌ హెడ్‌ మనీష్ కుమార్ చెప్పారు.



You may be interested

మణప్పురం ఫైనాన్స్‌ లాభం రూ.200 కోట్లు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.200 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని, 21 శాతం వృద్ధి సాధించామని మణప్పురం ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.856 కోట్ల నుంచి రూ.947 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 55 పైసల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఈ

ఐషర్‌ మోటార్స్‌ లాభం రూ.576 కోట్లు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఐషర్‌ మోటార్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.576 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.460 కోట్లతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.2,255 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.2,548 కోట్లకు పెరిగింది.

Most from this category