STOCKS

News


హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్‌ డేటా సెంటర్‌

Tuesday 23rd April 2019
news_main1555995328.png-25283

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. ఇది తెలంగాణలో మొదటిదని, దేశంలో రెండో సెంటర్‌ అని ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్‌ ఆపరేటర్‌ ‘కంట్రోల్‌ ఎస్‌’ (సీటీఆర్‌ఎల్‌ ఎస్‌) పార్టనర్‌షిప్‌తో దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఈ సెంటర్‌ ఏర్పాటుతో ఎక్కువ సంఖ్యలో స్థానిక తయారీ సంస్థలు. విక్రయదారులు, ఎంఎస్‌ఎంఈలను చేరుకునేందుకు వీలవుతుందని, నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సెంటర్‌ పూర్తిగా పునరుత్పాదక ఇంధనతో నడుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ, కామర్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డేటా సెంటర్స్‌ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దీంతో మరిన్ని కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు.
 



You may be interested

లైవ్‌ క్లాస్‌లతో కాసుల వర్షం

Tuesday 23rd April 2019

- దేశీయంగా ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ల జోరు - ఆన్‌లైన్‌లో పోటీపరీక్షలు, పాఠ్యాంశాల బోధనపై దృష్టి - లిస్టులో బైజూస్, అన్‌ అకాడెమీ తదితర సంస్థలు న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీంతో లైవ్‌ తరగతులు నిర్వహించే పలు ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థల ఆదాయం భారీగా పెరుగుతోంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ రూపొందించిన నివేదిక ప్రకారం... ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఫీజులు చెల్లించి

రెండు వారాల కనిష్టానికి రూపాయి

Tuesday 23rd April 2019

డాలర్‌తో 32 పైసలు నష్టం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 32 పైసలు నష్టపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో 69.88 వరకు తగ్గిన రూపాయి చివరికి 69.67 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. ఇరాన్‌ చమురు దిగుమతులపై మినహాయింపులను అమెరికా ఎత్తివేయనుందన్న వార్తలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల రూపాయిపై ప్రభావం చూపించిందని, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల

Most from this category