STOCKS

News


ఫ్లిప్‌కార్ట్‌ బన్సల్స్‌పై ఐటీ శాఖ దృష్టి

Friday 23rd November 2018
news_main1542947949.png-22324

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహవ్యవస్థాపకులు సచిన్‌, బిన్నీ బన్సల్‌లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు వాటాలు విక్రయించిన డీల్‌పై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. ఈ వాటాల విక్రయంతో ఎంత ఆదాయం వచ్చింది, దానికి సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఎప్పుడు డిపాజిట్ చేయబోతున్నారో తెలియజేయాలంటూ సచిన్‌, బిన్నీలకు నోటీసులు పంపింది. ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్‌పై బిన్నీ, సచిన్‌లు 20 శాతం మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 75 శాతం పన్నును డిసెంబర్ 15లోగా అడ్వాన్స్ ట్యాక్స్‌గా, మిగతా మొత్తాన్ని వచ్చే ఏడాది మార్చి 15లోగా కట్టాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు. "వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను అంతర్జాతీయ ట్యాక్సేషన్ విభాగం అధ్యయనం చేసింది. దీని ప్రకారం బిన్నీ, సచిన్ బన్సల్‌ల పన్నుల అసెస్‌మెంట్‌, చెల్లింపు ఏ కార్యాలయ పరిధిలో చేస్తున్నదీ తెలియజేయాలంటూ వారికి లేఖ రాయడం జరిగింది. సాధారణంగా వారిద్దరూ తమ ఆదాయ పన్ను రిటర్నులను బెంగళూరులో దాఖలు చేస్తుంటారు. కాబట్టి ఇకపై అక్కడి అసెసింగ్ ఆఫీసర్‌ ఈ అంశాన్ని పరిశీలిస్తారు" అని అధికారి పేర్కొన్నారు. 
16 బిలియన్ డాలర్ల డీల్‌..
వాల్‌మార్ట్ ఈ ఏడాది ఆగస్టులో దాదాపు 16 బిలియన్ డాలర్లు చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. సాఫ్ట్‌బ్యాంక్, నాస్పర్స్‌ తదితర 44 ఇన్వెస్టర్ల నుంచి వాటాలు కొంది. ఇదే సందర్భంలో ఫ్లిప్‌కార్ట్‌లో సచిన్ బన్సల్‌ తనకున్న మొత్తం 5-6 శాతం వాటాలను విక్రయించగా, బిన్నీ బిన్సల్ కొంత భాగాన్ని విక్రయించారు.  44 విదేశీ షేర్‌హోల్డర్ల వాటాల కొనుగోలుకు సంబంధించి అంతర్జాతీయ ట్యాక్సేషన్ నిబంధనల ప్రకారం వాల్‌మార్ట్ ఇప్పటికే రూ.7,439 కోట్ల పన్ను మొత్తాన్ని డిపాజిట్ చేసింది. సచిన్‌, బిన్నీ బన్సల్‌ల ఆదాయాన్ని దేశీయ పన్ను చట్టం కింద విడిగా మదింపు చేయాల్సి ఉంది. దీని ప్రకారం క్యాపిటల్ గెయిన్స్‌పై 20 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. సచిన్, బిన్నీ బన్సల్‌లు భారత్‌లో నివాసితులు అయినందున ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై వారు ఇక్కడ పన్ను కట్టాల్సి ఉంటుందని నాంగియా అడ్వైజర్స్‌ మేనేజింగ్ పార్ట్‌నర్ రాకేష్ నాంగియా తెలిపారు. ఒకవేళ వారు అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్‌ చేయని పక్షంలో సెక్షన్‌ 234బి, సెక్షన్ 234సి కింద ఆ తర్వాత వడ్డీతో కలిపి కట్టాల్సి వస్తుందన్నారు. You may be interested

బీఓబీ ఉద్యోగులకు షేర్లు !

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్‌ పర్చేజ్‌ స్కీమ్ (ఈఎస్‌పీఎస్‌) కింద తాజా షేర్లను జారీ చేయనుంది. ఈ విషయంపై చర్చించి, ఆమోదం తెలపడానికి తమ డైరెక్టర్లు ఈ నెల 29న సమావేశం కానున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. అనుభవం గల ఉద్యోగులను అట్టిపెట్టుకోవడానికి గాను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు తమ ఉద్యోగులకు షేర్లను జారీ చేయడానికి గత ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం

భారతీ ఆక్సా లైఫ్‌ వ్యాపారంలో 52 శాతం వృద్ధి

Friday 23rd November 2018

ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌, ఆక్సా గ్రూపు జాయింట్‌ వెంచర్‌ కంపెనీ భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నూతన వ్యాపార ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 52 శాతం పెరిగి రూ.398 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.262 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఇక రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం సైతం 21 శాతం వృద్ధితో రూ.453 కోట్లుగా నమోదైంది. మొత్తం ప్రీమియం చూస్తే.. 34

Most from this category