STOCKS

News


వచ్చే నెల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌

Wednesday 26th September 2018
news_main1537939586.png-20585

న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌లో 'ది బిగ్ బిలియన్ డేస్‌' (టీబీబీడీ) సేల్ ప్రారంభించనుంది. టీబీబీడీ అయిదో ఎడిషన్‌ అక్టోబర్ 10 నుంచి 14 దాకా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వాటన్నింటిపై భారీ ఆఫర్లు ఉంటాయని సంస్థ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వచ్చే నెల పండుగ సీజన్‌లో వివిధ ఈ-కామర్స్ సైట్లలో దాదాపు 2 కోట్ల మంది షాపింగ్ చేస్తారని అంచనాలు ఉన్నాయి. 
ఫ్లిప్‌కార్ట్ చేతికి ఇజ్రాయెల్ కంపెనీ..
ఇజ్రాయెల్‌కి చెందిన అప్‌స్ట్రీమ్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. ఉత్పత్తులు.. వాటి ధరల విశ్లేషణ తదితర అంశాలకు సంబంధించి అప్‌స్ట్రీమ్ కామర్స్‌ క్లౌడ్ ఆధారిత సర్వీసులు అందిస్తోంది. తమ ప్లాట్‌ఫాంపై విక్రయించేవారికి మార్కెట్‌పై మరింత అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ కొనుగోలు తోడ్పడుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
 



You may be interested

నష్టాల్లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు..!

Wednesday 26th September 2018

ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఇంట్రాడేలో 1.50శాతం క్షీణించింది. నేటి ఉదయం మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా నేటి ఉదయం నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌  సూచీ 1శాతం ర్యాలీ చేసింది. అనంతరం క్షణాల్లో అరంభ లాభాల్ని కోల్పోయిన ఈ సూచీ ఇంట్రాడేలో 1.50శాతం నష్టపోయింది. అత్యధికంగా ఆంధ్రాబ్యాంక్‌ షేరు

చర్యల కంటే పోస్ట్‌మార్టమ్‌ చేయడం తేలికే

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో తదుపరి సంక్షోభం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఇచ్చిన రుణాల రూపంలో రానుందంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తిప్పికొట్టారు. అవసరమైన సమయంలో చర్యలు తీసుకోవడం కంటే శవ పంచనామా (పోస్ట్‌మార్టమ్‌/జరిగిన తర్వాత విశ్లేషణ) చేయటం సులువేనని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేయడానికి పూర్వం రాజన్‌ ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు. అప్పట్లో

Most from this category