News


బిగ్‌ ఛాలెంజ్‌ డే..!

Saturday 13th October 2018
news_main1539409447.png-21108

న్యూఢిల్లీ: దేశీ ఈ–కిరాణాలో హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ పోటీ దిగ్గజ విదేశీ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల మధ్యనే తారస్థాయిలో కొనసాగుతోంది. భారత ఆన్‌లైన్‌ అంగడిలో నెంబర్‌ వన్‌ ర్యాంకును, సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకోవడం కోసం పోటీకి ఎదురు నిలబడి... ఇరు సంస్థలు భారీ ప్రకటనలు, ధీటైన సవాళ్లతో హోరెత్తిస్తున్నాయి. జరుగుతున్నది పోటీనే అని నేరుగా ఒప్పుకోకపోయినా, ప్రత్యక్ష వ్యాఖ్యలతో చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడి మార్కెట్లో తమకు సరైన ప్రత్యర్థి లేదని, ఈ రంగంలో పోటీ అనేది అమెరికా మార్కెట్‌కు మాత్రమే పరిమితమైన అంశమని వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. పోటీదారున్నప్పుడే ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని చెబుతూ...  పలు ఉత్పత్తుల అమ్మకాలలో తమను మించినవారు లేరని ప్రకటించింది. అయితే తాజా ఫెస్టివల్‌ సీజన్లో అత్యధిక మంది సందర్శించిన ఈ-కామర్స్‌ సైట్‌ తమదేనని, లావాదేవీలూ ఎక్కువ జరిగింది తమ సైట్‌లోనేనని అమెజాన్‌ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, దుస్తుల వంటి విభాగాల వారీగా నెంబర్‌ వన్‌ మేమంటే మేమని దిగ్గజ ఆన్‌లైన్‌ సంస్థలు రెండూ చెబుతున్నాయి. నిజానికి ఈ సారి పండగ సీజన్‌ సందర్భంగా స్నాప్‌డీల్‌, పేటీఎం మాల్‌ వంటి సంస్థలు సైతం పలు ఆఫర్లతో ముందుకొచ్చాయి. కానీ పోటీ మాత్రం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్యే నెలకొనటం గమనార్హం. 
కస్టమర్లకే ప్రాధాన్యం: అమెజాన్‌
కస్టమర్లు కొనుగోలు చేసిన వస్తువుల్ని అత్యంత వేగంగా వారికి చేరేలా చూడడంపైనే దృష్టిసారించాం తప్ప పోటీపై కాదని అమెజాన్ ఇండియా సీఈఓ అమిత్ అగ‌ర్వాల్ చెప్పారు. ‘ఉత్పత్తి బీమా, వారంటీ, ఇన్‌స్టలేషన్‌ వంటి వినియోగదారుల రక్షణ అంశాలపైనే దృష్టిసారించాం. గతేడాది కంటే ఈసారి గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సీజన్‌ మూడు రెట్లు పెద్దగా రికార్డు నెలకొల్పనుంది. కొత్త కస్టమర్లు పెరిగారు.’ అని అమిత్‌ చెప్పారు. 
గతేడాది కంటే అధిక సేల్స్‌..
చిన్న నగరాలలో కూడా ఈ-కామర్స్‌ సేవలు అందిస్తున్న కారణంగా గతేడాది కంటే ఈసారి బిగ్‌ బిలియన్‌ డే అమ్మకాలు కచ్చితంగా ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. పోటీపై మాట్లాడిన ఈయన.. ‘అంతర్జాతీయ స్థాయిలో తప్ప భారత్‌ మార్కెట్‌లో మాకు పోటీ అనేది సంబంధంలేని మాట. పోటీ ఉన్నప్పుడు ఆవిష్కరణలు పెరగాలి. నిజానికి భారత మార్కెట్‌లో ఆ పరిస్థితి ఉందా అంటే.. జీరో అనే చెప్పాలి.’ అన్నారాయన.
మూడు రోజుల్లో రూ.11,085 కోట్ల అమ్మకాలు
రెడ్‌సీర్‌ కన్సెల్టింగ్‌ సంస్థ నివేదిక ప్రకారం పండుగల ఆఫర్‌ మొదలైన రెండున్నర రోజుల్లోనే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫాంల ద్వారా రూ.11,085 కోట్ల అమ్మకాలు జరిగాయి. 46 లక్షల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవగా వీటి విలువ రూ.5,887 కోట్లుగా సర్వే సంస్థ వెల్లడించింది. రూ.1,251 కోట్ల విలువైన గృహోపకరణాలు, రూ.883 కోట్ల ఫ్యాషన్‌ అమ్మకాలు జరిగాయి. ఐదు రోజుల పండుగ సేల్స్‌ సీజన్‌ పూర్తయ్యే నాటికి దేశీ ఈ-కామర్స్‌ సంస్థల మొత్తం అమ్మకాలు 3 బిలియన్‌ డాలర్లుగా (రూ.22,077 కోట్లు) నమోదయ్యే అవకాశం ఉందని రెడ్‌సీర్‌ అంచనావేసింది.
 You may be interested

4 కంపెనీల ఆస్తులు వేలం వేయనున్న సెబీ

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్మును రాబట్టే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నాలుగు కంపెనీల ఆస్తులను వేలం వేయనుంది. స్వర్ ‍ఆగ్రోటెక్‌, లైఫ్‌ కేర్ ఇన్‌ఫ్రాటెక్‌, సర్వ్‌హిట్ హౌసింగ్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రాఘవ్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన ఆరు ప్రాపర్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర మొత్తం రూ. 4.74 కోట్లుగా సెబీ నిర్ణయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఈ ఆస్తులను నవంబర్ 11న

పుత్తడి, వెండిల్లో కమోడిటీ డెరివేటివ్స్‌

Saturday 13th October 2018

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) పుత్తడి, వెండిల్లో కమోడిటీ డెరివేటివ్స్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో భాగంగా ముందుగా వ్యవసాయేతర కమోడిటీ డెరెవేటివ్స్‌ ట్రేడింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్‌ లిమాయే చెప్పారు. ఆ తర్వాత వ్యవపాయ ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తెస్తామని వివరించారు. ప్రస్తుతం పుత్తడిలో ఒక కేపీ, 100 గ్రాములు, వెండి(30కేజీ) విభాగాల్లో కమోడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ

Most from this category