STOCKS

News


ఈ నెల 18 నుంచి తొలి రీట్‌

Wednesday 13th March 2019
news_main1552460728.png-24580

- ఆఫర్‌ చేస్తున్న ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌
- ప్రైస్‌బ్యాండ్‌ రూ.299- 300

న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ రీట్‌ ఆఫర్‌కు రూ.299- 300 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌​కంపెనీ బ్లాక్‌స్టోన్‌, రియల్టీ కంపెనీ ఎంబసీల జాయింట్‌ వెంచర్‌, ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఈ రీట్‌ను ఆఫర్‌ చేస్తోంది. మొత్తం 12.95 కోట్ల యూనిట్లను విక్రయించనున్నారు. ఈ రీట్‌ ద్వారా రూ.4,750 కోట్లు సమీకరించాలని ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ యోచిస్తోంది. ఇప్పటికే రూ.876 కోట్ల మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ హామీని పొందింది. అమెరికన్‌ ఫండ్స్‌ ఇన్సూరెన్స్‌ సిరీస్‌, న్యూ వరల్డ్‌ ఫండ్‌ ఐఎన్‌సీ, స్మాల్‌క్యాప్‌ వరల్డ్‌ ఫండ్‌ ఇన్‌కార్పొ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలకు 2.92 కోట్ల యూనిట్లను కేటాయించి రూ.876 కోట్లు సమీకరిస్తారు.  
రీట్‌ అంటే....
అద్దెలు ఆర్జించే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను నిర్వహించే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాన్ని రీట్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా దీంట్లో ఇన్వె‍స్ట్‌ చేయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను 2014లోనే సెబీ నోటిఫై చేసింది. 
9 శాతం రాబడి... 
ఈ రీట్‌పై తొలి ఏడాది ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (ఐఆర్‌ఆర్‌) 9 శాతంగా, ఐదేళ్ల కాలానికి 18 శాతం మేర ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ ప్రతిపాదిత రీట్‌లో 33 మిలియన్‌ చదరపుటడుగుల ఆఫీస్‌, హాస్పిటాలిటీ అసెట్స్‌ ఉన్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, నోయిడాలోని ఏడు బిజినెస్‌ పార్క్‌లు, నాలుగు సిటీ- సెంట్రిక్‌ బిల్డింగ్స్‌ భాగంగా ఉన్నాయి. దీంట్లో 24 మిలియన్‌ చదరపుటడుగుల అసెట్స్‌ ద్వారా ఏడాదికి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. 3 మిలియన్‌ చదరపుటడుగుల రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు నిర్మాణంలో ఉండగా, మరో 6 మిలియన్‌ చదరపుటడుగుల రియల్టీ ఆస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న మూడేళ్లలో అద్దె ఆదాయం 55 శాతం పెరగగలదన్న అంచనాలున్నాయి. ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌కు వచ్చే అద్దె ఆదాయాల్లో సగానికి పైగా ఫార్చ్యూన్‌ 500 కంపెనీల నుంచే వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

 



You may be interested

5.15 లక్షల కోట్లకు బ్యాంకు రుణాలు

Wednesday 13th March 2019

- 4.86 శాతం వృద్ధితో 4.33 లక్షల కోట్లకు డిపాజిట్లు - తెలంగాణ ఎస్‌ఎల్‌బీసీ వెల్లడి హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో: గతేడాది డిసెంబర్‌ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి

హువావే స్మార్ట్‌వాచ్‌ @ రూ.15990

Wednesday 13th March 2019

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ డివైజెస్‌ తయారీ సంస్థ హువావే.. మూడేళ్ల విరామం తరువాత స్మార్ట్‌వాచ్‌ విభాగంలోకి మళ్లీ ప్రవేశించింది. ఇతర కంపెనీల కంటే తక్కువ ధరలతో క్లాసిక్‌, స్పోర్ట్స్‌ ఎడిషన్‌ వాచీలను మంగళవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. ‘జీటీ’ పేరుతో విడుదలైన వాచ్‌ ధరల శ్రేణి రూ.15,990 నుంచి రూ.16,990 వద్ద నిర్ణయించింది. 2016లో విడుదలైన రూ.22,999 స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. గుండె కొట్టుకునే

Most from this category