STOCKS

News


మూడు బ్యాంకుల విలీనానికి గ్రీన్‌ సిగ్నల్‌

Saturday 22nd December 2018
news_main1545450466.png-23152

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోద ముద్ర వేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. విలీన ప్రతిపాదనకు ఏఎం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం సమాచారమిచ్చిందని బీవోబీ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్‌ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 29న బీవోబీ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మిగతా రెండు బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఇప్పటికే ఓకే చెప్పాయి. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పాటయ్యే కొత్త సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత స్థానాన్ని ఇది దక్కించుకుంటుంది. విలీన బ్యాంక్‌ మొండిబాకీల నిష్పత్తి 5.71 శాతంగా ఉండనుంది. పీఎస్‌బీల సగటు 12.13 శాతం కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. విలీన ప్రతిపాదనకు ఏఎం అనుమతుల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో బీవోబీ షేరు .. 0.30 శాతం పెరిగి రూ. 115.20 వద్ద క్లోజయ్యింది.



You may be interested

రూ.2 లక్షల కోట్లకు మెథనాల్‌ వాటా

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: మెథనాల్‌ వినియోగం రూ.11,000 కోట్ల స్థాయి నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్‌ కృషి చేస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. తద్వారా పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచడంతో పాటు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకుంటామని స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా

ఈ-కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ-కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2-3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల

Most from this category