STOCKS

News


బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి

Tuesday 15th January 2019
news_main1547531388.png-23589

  • క్రమంగా తగ్గించుకోనున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్‌ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్‌ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయి. అందుకు సంబంధించి వారికి పూర్తి అనుమతులు ఇచ్చాం’’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గింపుతో సెబీ ‘కనీస ప్రజల వాటా’ నిబంధనలను పాటించేందుకు వీలవుతుందన్నారు. తగిన జాగ్రత్తలతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఇది ప్రోత్సహిస్తుందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి 75 శాతానికి పైగా వాటా ఉండడం గమనార్హం. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలి.  ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఇప్పటికే క్యూఐపీ విధానంలో రూ.20,000 కోట్ల మేర షేర్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 58.53 శాతం నుంచి తగ్గుతుంది. సిండికేట్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంకులు ఇప్పటికే ఉద్యోగులకు షేర్ల అమ్మకం ద్వారా నిధుల సమీకరణ చర్యలను చేపట్టాయి. దీని ద్వారా కూడా ప్రభుత్వం వాటా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.



You may be interested

మళ్లీ 71వైపునకు జారిన రూపాయి

Tuesday 15th January 2019

ముంబై: డాలర్‌ మారకంలో  రూపాయి విలువ మళ్లీ పతనబాట పట్టింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ  ఒకేరోజు 43 పైసలు క్షీణించి 70.92 వద్ద ముగిసింది. గడచిన నెల రోజుల్లో ఈ స్థాయికి రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 17న రూపాయి 71.56 వద్ద ముగిసింది. కారణాలు చూస్తే... - శుక్రవారం వెలువడిన నవంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను చూస్తే, ఆ నెల్లో కేవలం అరశాతం

10670 పాయింట్ల మద్దతు కోల్పోతే కల్లోలమే!

Tuesday 15th January 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ కొన్నాళ్లుగా ట్రేడ్‌వార్‌, యూఎస్‌ షట్‌డౌన్‌, ఐటీ కంపెనీల పేలవ ఫలితాలు, నీరసమైన ఆటో అమ్మక గణాంకాలు, రాబోయే ఎన్నికలపై రాజకీయ రచ్చ తదితర ఇబ్బందికర వార్తల నడుమ నిఫ్టీ సమతూకం కోల్పోకుండా జాగ్రత్తగా బాలెన్స్‌అవుతూ వస్తోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. స్వల్పరేంజ్‌లోనే కదలాడుతున్నా, నిఫ్టీ పెద్దగా పతనాలను చూడలేదు. ఈ నెగిటివ్‌ వార్తలన్నింటినీ సూచీలు ప్రైస్‌ఇన్‌ చేసినట్లు కనిపిస్తోంది. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ రివర్సల్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. హామర్‌,

Most from this category