STOCKS

News


సీపీఎస్‌ఈల విలీనంపై కేంద్రం కసరత్తు

Friday 12th October 2018
news_main1539318295.png-21068

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) విలీనం, కొనుగోళ్ల ప్రక్రియను (ఎంఅండ్‌ఏ) ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే మర్చంట్ బ్యాంకర్స్, లీగల్ సంస్థల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంకా విలీనాలు, కొనుగోళ్లకు అనువైన సంస్థలను నిర్దిష్టంగా గుర్తించనప్పటికీ.. సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వివరించాయి. దీంతో పాలనా విభాగం నుంచి అధికారిక ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా సత్వరం విలీన, కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించనవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "బిడ్డింగ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లకు రెండు డీల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంఅండ్‌ఏ కోసం ఎంపిక చేసిన సీపీఎస్‌ఈల పేర్లను ప్రీ బిడ్‌ సమావేశంలో లేదా అంతకన్నా ముందుగానే మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్లకు ఇవ్వడం జరుగుతుంది" అని ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటిదాకా పీఎస్‌యూల ఐపీవోలు, ఎఫ్‌పీవోలు, ఈటీఎఫ్‌ల ద్వారా రూ. 9,200 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై మరింతగా దృష్టి పెడుతోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో 65.61 శాతం వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)కి విక్రయించాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఖజానాకు రూ. 13,000 కోట్ల దాకా రావొచ్చు. You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టీసీఎస్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌

ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం!!

Friday 12th October 2018

న్యూఢిల్లీ: పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్కసారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్ స్వేఛ్చ ఉంటుందని, ఇక ఓఎన్‌జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ

Most from this category