మరో రూ.27,380 కోట్లు ఇవ్వండి
By Sakshi

న్యూఢిల్లీ: రిస్కులు, రిజర్వుల పేరిట గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తన వద్ద అట్టే పెట్టుకున్న రూ. 27,380 కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్‌ను (ఆర్బీఐ) కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. 2016-17లో ఆర్బీఐ రూ. 13,190 కోట్లు, 2017-18లో రూ. 14,190 కోట్లు రిస్కులు, రిజర్వుల కింద ఆర్బీఐ పక్కన పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిధులను ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్రం కోరినట్లు వివరించాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం మొండిబాకీలు, అసెట్స్ తరుగుదల మొదలైన వాటన్నింటికి కేటాయింపులు పోగా మిగిలే లాభాలను కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. జూలై-జూన్ ఆర్థిక సంవత్సర విధానాన్ని పాటించే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా కేంద్రానికి రూ. 40,000 కోట్లు బదలాయించింది. ఈసారి రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ. 28,000 కోట్ల మేర మధ్యంతర డివిడెండ్ కూడా రాగలదని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఇటీవలే పేర్కొన్నారు. ఒకవేళ దీనికి ఆర్బీఐ బోర్డు ఆమోదముద్ర వేసిన పక్షంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 68,000 కోట్ల మేర మిగులు నిధులను కేంద్రానికి బదలాయించినట్లవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 69,000 కోట్ల డివిడెండ్ రాగలదని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. 2019-20లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ. 82,912 కోట్లు రావొచ్చని భావిస్తోన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
You may be interested
ఎంఅండ్ఎం షేరును ఏం చేద్దాం?
Monday 11th February 2019డిసెంబర్ త్రైమాసిక ఫలితాల అనంతరం ఎంఅండ్ఎం షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల ధృక్పథం ఇలా ఉంది... 1. డాయిష్ బ్యాంకు: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ ధరను రూ. 850 నుంచి రూ. 815కు తగ్గించింది. రాబోయే మూడు సంవత్సరాలకు ఎబిటా అంచనాలను వరుసగా 8, 7, 4 శాతానికి తగ్గించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ అంచనాను మాత్రం 12 శాతం పెంచింది. 2. జేపీ మోర్గాన్: ఓవర్‌వెయిట్ రేటింగ్. టార్గెట్ రూ.
సిటీ గ్యాస్ బిడ్డింగ్‌లో ఐవోసీ టాప్
Monday 11th February 2019న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్జీఆర్బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35