STOCKS

News


వాట్సాప్‌నకు మూడో నోటీసుపై కేంద్రం యోచన

Friday 21st September 2018
news_main1537504300.png-20428

న్యూఢిల్లీ: మెసేజీల జాడ కనుక్కునే సాంకేతికతను అమలు చేయాలంటూ మెసెంజర్‌ సేవల సంస్థ వాట్సాప్‌నకు మూడోసారి నోటీసు ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ యోచిస్తోంది. దీనిపై అంతర్గతంగా చర్చ జరిగినట్లు, వచ్చే వారం, పది రోజుల్లో వాట్సాప్‌నకు మూడోసారి నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాట్సాప్‌లో వైరల్‌గా మారుతున్న తప్పుడు వార్తలు, మెసేజీలు పలు సందర్భాల్లో హింసకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇటువంటి మెసేజీలకు మూలం ఎక్కడ ఉంది, ఎలా విస్తరిస్తున్నాయి అన్నది జాడ తెలుసుకునేందుకు తగు సాంకేతికతను అందుబాటులోకి తేవాలంటూ వాట్సాప్‌నకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపింది. అయితే, సందేశాల ఎన్‌క్రిప్షన్‌కు, యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందనే కారణాలతో వాట్సాప్ ఇందుకు అంగీకరించడం లేదు. అయితే, మెసేజీలను ఫార్వర్డ్ చేయడంపై పరిమితులను మాత్రం ప్రవేశపెట్టింది. దీంతో తమకు వచ్చిన కంటెంట్‌ను ఇతరులు ఫార్వర్డ్ చేసిన పక్షంలో .. సదరు మెసేజీపై ఫార్వర్డ్ అనే లేబుల్ కనిపిస్తుంది.    



You may be interested

మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త తరం సి-క్లాస్‌ కారు

Friday 21st September 2018

ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా సి-క్లాస్‌లో కొత్త తరం కార్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో సి 220డి ప్రైమ్ ధర రూ. 40 లక్షలు, సీ 220డి ప్రోగ్రెసివ్‌ రేటు రూ. 44.25 లక్షలు, టాప్ ఎండ్‌ సి 300డి ఏఎంజీ ధర రూ. 48.50 లక్షలుగా ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. ప్రస్తుత

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మహర్ధశ!

Friday 21st September 2018

న్యూఢిల్లీ: చాలా కాలం తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ తదితర పథకాల్లో డిపాజిట్లపై 0.30-0.40 శాతం వరకు పెంచింది. ఈ మేరకు అక్డోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి అమల్లో ఉండే వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఇంత కాలం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్రం... ఆర్‌బీఐ కీలక రేట్లను పెంపు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే

Most from this category