STOCKS

News


పరిమితి పెంపుతో వేగంగా రుణాల రికవరీ

Wednesday 12th September 2018
news_main1536730153.png-20191

న్యూఢిల్లీ: డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌కు (డీఆర్‌టీ) నివేదించదగ్గ మొండిబాకీల కేసుల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణనిచ్చింది. మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేగంగా రికవర్ చేసుకోవడానికి ఇది తోడ్పడగలదని పేర్కొంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల రికవరీ చట్టం 1993ని సవరిస్తూ.. గత వారంలో ఈ పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతల నుంచి సొమ్మును రాబట్టే క్రమంలో చట్టాలు, తత్సంబంధ ప్రక్రియలను సరళం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. దీనివల్ల చిన్నా, చితక వాటిపై కంటే భారీ మొండిబాకీల కేసులపై డీఆర్‌టీలు దృష్టి పెట్టడానికి వీలవుతుందన్నారు. జూన్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం డీఆర్‌టీల్లో రూ. 10- 20 లక్షల పరిమాణం గల కేసులు 38,376 పైచిలుకు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి వాటా 38 శాతం పైమాటే అయినప్పటికీ.. విలువపరంగా చూస్తే రికవర్ కావాల్సిన మొండి బాకీల్లో వీటి పరిమాణం 4 శాతమే. ఇటీవల రూ.20 లక్షల లోపు ఎన్‌పీఏల కేసుల వాటా 41 శాతానికి పెరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. నిర్దేశిత 60 రోజుల్లోగా మొండిబాకీ కేసు విచారణ పూర్తి చేసి, డిఫాల్ట్ అయిన రుణగ్రహీతల ఆస్తులను జప్తు చేసే ప్రక్రియపై జిల్లా మేజిస్ట్రేట్‌లు మరింతగా దృష్టి పెట్టేలా చూడాలంటూ రాష్ట్రాలకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ సూచించినట్లు ఆయన వివరించారు. జిల్లా మేజిస్ట్లేట్‌ న్యాయస్థానాల్లో రూ. 40,000 కోట్ల బకాయిలకు సంబంధించి 10,000 పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. వేలం ప్రక్రియను మరింత మెరుగుపర్చే క్రమంలో ఈ-ఆక్షన్ బజార్‌ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ వివరించారు. You may be interested

భారత మార్కెట్లోకి బ్లౌపంక్ట్‌ టీవీలు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బ్లౌపంక్ట్‌  భారత మార్కెట్లోకి ఎనిమిది టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు సిరీస్‌ల్లో ఈ టీవీలు లభిస్తాయని వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 రేంజ్‌లో ఉంటాయని బ్లౌపంక్ట్‌ టెలివిజన్‌  ఇండియా ఎమ్‌డీ, సీఈఓ కరణ్‌ బేడి తెలిపారు. ఈ టీవీల విక్రయం కోసం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని బ్లౌపంక్ట్‌ భారత భాగస్వామి,  ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎమ్‌డీగా

అతివిశ్వాసమే మొండిబాకీలకు కారణం

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: బ్యాంకర్లు అతినమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మందగించడంతో పాటు ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావడమే మొండిబాకీలు (ఎన్‌పీఏ) పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. మురళీ మనోహర్‌ జోషి సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీకి పంపిన నోట్‌లో ఈ మేరకు వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులు మొదలైన వాటిపై అనుమానాలు రేకెత్తడం, విచారణనెదుర్కొనాల్సి రావొచ్చన్న భయాల

Most from this category