STOCKS

News


ఖాతాదారులకు ఎస్‌బీఐ పండగ ఆఫర్లు

Monday 15th October 2018
news_main1539581696.png-21155

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పండుగ సీజన్ సందర్భంగా తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) యాప్ ద్వారా షాపింగ్ చేసినవారికి అదనంగా డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాంక్ అందిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 16-21 మధ్యలో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం దాకా డిస్కౌంటు, క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్లు ఇచ్చే డిస్కౌంట్లకు ఇవి అదనం. "టాప్ 14 ఈ-కామర్స్ సంస్థలు .. ఫ్యాషన్ నుంచి ఫర్నిచర్ దాకా పలు ఉత్పత్తులపై సాధారణంగా 50 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నాయి. యోనో షాపింగ్ ఫెస్టివల్ (వైఎస్‌ఎఫ్‌)లో  భాగంగా మా యాప్ ద్వారా ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో డిజిటల్ షాపింగ్ చేస్తే 10 శాతం దాకా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అందిస్తున్నాం" అని ఎస్‌బీఐ ఎండీ పి.కె. గుప్తా వెల్లడించారు. ఎస్‌బీఐ కస్టమర్లందరికీ ఫైనాన్సింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని ఆయన వివరించారు. అమెజాన్‌, జబాంగ్‌, మింత్రా, కల్యాణ్‌ జ్యువెలర్స్, క్యారట్‌లేన్‌, పీసీజే, పెపర్‌ఫ్రై, ఓయో, టాటా క్లిక్‌, యాత్రా, ఫస్ట్‌క్రై, ఈజ్‌మైట్రిప్‌, ఐజీపీ, ఫెర్న్స్‌ అండ్ పెటల్స్ సంస్థలతో వైఎస్‌ఎఫ్‌లో భాగంగా ౾ఎస్‌బీఐ ప్రత్యేక ఒప్పందాలు దుర్చుకుంది. కస్టమర్‌ బ్యాంకు శాఖకు రావాల్సిన అవసరం లేకుండా యోనో ద్వారా ప్రీ-అప్రూవ్డ్ రుణాలు తదితర సర్వీసులు కూడా అందిస్తున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 30 లక్షల మంది యోనో యాప్‌ను వినియోగిస్తుండగా, రోజుకు 25,000 మంది దాకా కొత్త కస్టమర్లు జతవుతున్నారని ఆయన పేర్కొన్నారు.You may be interested

10290 పాయింట్ల వద్ద బలమైన మద్దతు

Monday 15th October 2018

నిఫ్టీపై నార్నోలియా అంచనా చాలారోజుల అమ్మకాల తర్వాత గత వారం స్టాకులు రిలీఫ్‌ ర్యాలీ చూశాయి. చార్టుల్లో బలమైన పాటర్న్‌ కనిపిస్తోంది. బ్యాంకు నిఫ్టీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ కనిపించడంతో పాటు ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. నిఫ్టీలో సైతం ఆర్‌ఎస్‌ఐ డబుల్‌ బాటమ్‌ను ఖరారు చేసింది. ఇండియా వీఐఎక్స్‌ 18.62కు దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో లాంగ్స్‌ను తీసుకోవచ్చు. ఇకపై నిఫ్టీకి అడుగడుగునా నిరోధాలు కనిపిస్తాయి.

ఫలితాలు, రూపాయి కదలికలే కీలకం..!

Monday 15th October 2018

ముంబై: శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత వెల్లడైన సీపీఐ, ఐఐపీ డేటా సోమవారం మార్కెట్‌ దిశపై ప్రభావం చూపనుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదైంది. గడిచిన మూడు నెలల కాలంలో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఐఐపీ గణాంకాలు నిరాశపరచగా.. సెప్టెంబర్‌ వినియోగ ధరల సూచీ  (సీపీఐ) ఆధారిత రిటైల్‌

Most from this category