STOCKS

News


టైమ్‌షేర్‌ ప్రాపర్టీలోకి ‘ఫెర్న్స్‌’ ఎంట్రీ

Wednesday 10th October 2018
news_main1539149110.png-21009

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఫెర్న్స్‌ ఎస్టేట్‌ అండ్‌ డెవలపర్స్‌ లగ్జరీ టైమ్‌షేర్‌ ప్రాపర్టీ విభాగంలోకి ప్రవేశించింది. తొలి దశలో రూ.700 కోట్ల పెట్టుబడులతో కర్నాటకలోని సక్లేశ్‌పూర్‌లో క్లబ్‌ రోసెట్టా పేరుతో టైమ్‌షేర్‌ ప్రాపర్టీని నిర్మించన్నునట్లు జాయింట్‌ ఎండీ అండ్‌ సీఈఓ జై శ్రీధర్‌ మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 100 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో 100 గదులు, 3 రెస్టారెంట్లు, బాంక్విట్‌ హాల్స్‌ వంటి వాటితో పాటూ ఆధునిక వసతులన్నీ ఉంటాయని పేర్కొన్నారు. క్లబ్‌ మెంబర్‌షిప్‌ ధరలు 20 ఏళ్లకు రూ.7 లక్షలు, 99 ఏళ్లకు రూ.11 లక్షలని చెప్పారు. రెండో దశలో హైదరాబాద్‌ నుంచి 3–4 గంటల ప్రయాణ దూరంలో పలు బీచ్‌ రిసార్ట్‌లను కూడా నిర్మించాలని లక్ష్యించినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం, బాపట్ల ప్రాంతాల్లో స్థల సమీకరణ కోసం చూస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఫెర్న్స్‌ బెంగళూరులో 2 కోట్ల చ.అ.ల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లను నిర్మించింది.



You may be interested

రిలీఫ్‌ ర్యాలీ..

Wednesday 10th October 2018

♦ భారీ లాభాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ♦ 10,400పైకి నిఫ్టీ ♦ సెన్సెక్స్‌ 400 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రిలీఫ్‌ ర్యాలీ చేస్తోంది. మార్నింగ్‌ లాభాలతో ప్రారంభమైన ఇండెక్స్‌లు అదే జోరు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పెరిగింది. ఉదయం 11:19 సమయంలో సెన్సెక్స్‌ 398 పాయింట్ల లాభంతో 34,697 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 10,434 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 10,400 మార్క్‌పైకి

పిక్సెల్ త్రీ విడుదల..

Wednesday 10th October 2018

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ సిరీస్‌లో గూగుల్ మంగళవారం పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ పేరిట కొత్త ఫోన్స్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో పిక్సెల్ 3 రేటు రూ. 71,000 నుంచి రూ. 80,000 దాకా ఉండనుండగా, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ రేటు రూ. 83,000 నుంచి రూ. 92,000దాకా ఉంటుంది. ఇవి 64జీబీ, 128 జీబీ వెర్షన్లలో లభిస్తాయి. అమెరికా మార్కెట్లో ‍అక్టోబర్ 19 నుంచి, భారత్‌ సహా మిగతా దేశాల్లో

Most from this category