STOCKS

News


ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ.333

Friday 18th January 2019
news_main1547790365.png-23657

  • 28 శాతం వృద్ధి
  • ఇతర ఆదాయం దన్ను

ముంబై: ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.334 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.260 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ తెలిపింది. ఇతర ఆదాయం బాగా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఫెడరల్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ శ్యామ్‌ శ్రీనివాసన్‌ చెప్పారు. రుణాలు 25 శాతం వృద్ధి చెందాయని, నికర వడ్డీ ఆదాయం  13 శాతం వృద్ధితో రూ.1,077 ‍కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 3.3 శాతం నుంచి 3.17 శాతానికి తగ్గిందని తెలియజేశారు.
ఇతర ఆదాయం 51 శాతం అప్‌...
ట్రేడింగ్‌ లాభాలు ఆరోగ్యకరంగా ఉండటంతో వడ్డీయేతర ఆదాయం రూ.229 కోట్ల నుంచి 51 శాతం వృద్ధితో రూ.345 కోట్లకు చేరిందని శ్రీనివాసన్‌ వెల్లడించారు. కేటాయింపులు రూ.162 కోట్ల నుంచి రూ.190 కోట్లకు ఎగిశాయని, ప్రొవిజినల్‌ కవరేజ్‌ రేషియో 68 శాతానికి ఎగసిందని వివరించారు. ఏడాది కాలంలో ఇది 70 శాతానికి పెరగగలదన్నారు.
పెరిగిన మొండి బకాయిలు...
స్థూల మొండి బకాయిలు 2.52 శాతం నుంచి 3.14 శాతానికి పెరిగాయని శ్రీనివాసన్‌ తెలిపారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీకి ఎలాంటి రుణాలూ ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు రూ.245 కోట్ల మేర రుణాలిచ్చామని, తాము రుణాలు మంజూరు చేసిన ఈ గ్రూప్‌ ఎస్‌పీవీలు (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) మంచి పనితీరు సాధిస్తున్నాయని, అందుకని ఈ రుణాలపై ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. ఫెడరల్‌ బ్యాంక్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి.



You may be interested

బీహెచ్‌ఈఎల్‌ ఎలక్ట్రిక్‌ చార్జింగ్ స్టేషన్లు

Friday 18th January 2019

ఢిల్లీ-చండీగఢ్‌ హైవేపై ఏర్పాటు న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఢిల్లీ- చండీగఢ్‌ జాతీయ రహదారిపై సోలార్‌ ఆధారిత చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌ ప్రకటించింది. ‘‘250 కిలోమీటర్ల పరిధిలో మధ్య మధ్యలో ఈ ఎలక్ట్రిక్‌ చార్జర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మధ్యలో చార్జింగ్‌ అయిపోతుందేమో!! ప్రయాణించటం కష్టమేమో!! అనే భయాలు ఎలక్ట్రిక్‌ వాహనాదారుల్లో తొలగుతాయి. ఎలక్ట్రిక్‌ వాహన ప్రయాణాలపై విశ్వాసం పెరుగుతుంది’’ అని భెల్‌ వివరించింది.

కార్ల ధరలను పెంచనున్న హోండా

Friday 18th January 2019

- రూ.10,000 వరకు పెంపు - వచ్చే నెల నుంచి అమలు  న్యూఢిల్లీ: హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌)... తాను ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. మోడల్‌ ఆధారంగా ఈ పెంపు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చిన కంపెనీ సీనియర్‌ వైస్‌

Most from this category