News


ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ.266 కోట్లు

Tuesday 16th October 2018
news_main1539677806.png-21204

ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 1 శాతం వృద్ధితో రూ.266 కోట్లకు పెరిగింది. మొండి బకాయిల కేటాయింపులు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ క్యూ2లో వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 13.7 శాతం వృద్ధితో రూ.1,022 కోట్లకు ఎగసింది. ఫెడరల్‌ బ్యాంక్‌ రుణ వృద్ధిని గమనిస్తే వార్షికంగా 25.2 శాతం, త్రైమాసికంగా 9.8 శాతం పెరుగుదల కనిపించింది. క్వార్టర్‌ పరంగా చూస్తే బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ 3.12 శాతం నుంచి 3.15 శాతానికి మెరుగుపడింది. ఇక బ్యాంక్‌ రుణ నాణ్యత మరింత దిగజారింది. త్రైమాసికంగా చూస్తే స్థూల మొండి బాకాయిలు 3 శాతం నుంచి 3.11 శాతానికి పెరిగాయి. ఇదే కాలంలో నికర మొండి బాకాయిలు 1.72 శాతం నుంచి 1.78 శాతానికి ఎగశాయి. మొండి బకాయిల కేటాయింపులు క్వార్టర్‌ పరంగా 45 శాతం వృద్ధితో రూ.288 కోట్లకు చేరాయి. వార్షికంగా చూస్తే వడ్డీ యేతర ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ.322 కోట్లకు, నిర్వహణ లాభం 20 శాతం వృద్ధితో రూ.698 కోట్లకు పెరిగింది. 

క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు ధర మధ్యాహ్నాం 1:43 సమయంలో 7 శాతం పెరుగుదలతో రూ.81కి పెరిగింది. 



You may be interested

ఇన్ఫీ ఫలితాలు.. ఏం చూడాలి?

Tuesday 16th October 2018

మంగళవారం మార్కెట్‌ అనంతరం ఇన్ఫోసిస్‌ క్యు2 ఫలితాలు ప్రకటించనుంది. మంచి వృద్ది, మార్జిన్ల విస్తరణ.. ఈ దఫా ఫలితాల్లో ఉండొచ్చని ఎక్కువమంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. పనయా డౌన్‌గ్రేడ్‌కు సంబంధించిన నష్టాలు ముగిసిపోవడంతో కలిసివస్తుందని భావిస్తున్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌, ఎమ్‌కే గ్లోబల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ లాంటి ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనా ప్రకారం కంపెనీ నికరలాభం ఈ దఫా 3880- 4150 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చు. స్థిర కరెన్సీ వృద్ధి

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Tuesday 16th October 2018

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేయడంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ కంపెనీ షేరుకు పలు బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. ప్రస్తుత స్థాయి(రూ.926.95) నుంచి కంపెనీ షేరు ధీర్ఘకాలంలో 40 నుంచి 60శాతం వరకు లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచవచ్చని రేటింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు ఆయా రేటింగ్‌ సంస్థలు ఐబీఎల్‌ షేరుపై విశ్లేషణలను పరిశీలిద్దాం... 1.జేపీ మోర్గాన్‌:- కంపెనీ ఇటీవల మార్కెట్లో

Most from this category