STOCKS

News


ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం 46 శాతం అప్‌

Tuesday 16th July 2019
news_main1563271998.png-27104

జూన్‌ త్రైమాసికానికి ఫెడరల్‌ బ్యాంకు నికరలాభం 46.2 శాతం పెరిగి రూ. 384 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంకురూ. 263 కోట్ల లాభం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్ల పెరుగుదల తగ్గకున్నా, ఆస్తుల నాణ్యత బలహీనపడినా లాభంలో మాత్రం మెరుగుదల కనిపించింది. ఇతర ఆదాయాల్లో పెరుగుదల, ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ కలిసి ఎర్నింగ్స్‌కు ఉత్తేజాన్నిచ్చాయి. సమీక్షాకాలంలో ఎన్‌ఐఐ 17.8 శాతం పెరిగి రూ. 1154 కోట్లకు చేరింది. స్థూల నికర నిరర్ధక ఆస్తులు స్వల్పంగా పెరిగి 2.92 నుంచి 2.99 శాతానికి నికర ఎన్‌పీఏలు 1.48 నుంచి 1.49 శాతానికి చేరాయి. స్థూల స్లిపేజ్‌లు రూ. 415 కోట్లకు పెరిగాయి. ఇన్‌ఫ్రా, రోడ్‌లాంటి దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే రంగాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బ్యాంకు సీఈఓ శ్యామ్‌శ్రీనివాసన్‌ చెప్పారు. ఒత్తిడి సంకేతాలు ఇస్తున్న రంగాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ త్రైమాసికంలో మొండిపద్దుల కేటాయింపులు రూ. 178 కోట్ల నుంచి రూ. 192 కోట్లకు పెరిగాయి. ఇతర ఆదాయంలో 44.5 శాతం మెరుగుదల కనిపించింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఫెడరల్‌ బ్యాంకు షేరు దాదాపు 1.17 శాతం నష్టంతో 105. 45 రూపాయల వద్ద క్లోజయింది.



You may be interested

ఇప్పటికీ టీసీఎస్‌ మా టాప్‌ బెట్‌!

Tuesday 16th July 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అపూర్వ ప్రసాద్‌ టైర్‌ 1 ఐటీ షేర్లలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌పై బుల్లిష్‌గా ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అపూర్వ ప్రసాద్‌ చెప్పారు. ఇన్ఫీ ఫలితాలు బాగున్నా, ఇప్పటికీ టీసీఎస్‌ తమ టాప్‌ బెట్‌ అని చెప్పారు. మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లలో ఎంఫసిస్‌, హెక్సావేర్‌పై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఈ రెండు షేర్ల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, వీటి వ్యాపారాల్లో చురుకుదనం పెరిగిందని తెలిపారు. ఇటీవలి ఫలితాల అనంతరం

పీఈల పెట్టుబడుల జోష్‌.... యస్‌ బ్యాంక్‌ ర్యాలీ

Tuesday 16th July 2019

నాలుగు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయనే వార్తలను యస్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ ఖండించినప్పటికి మంగళవారం (జులై 16) ట్రేడింగ్‌లో యస్‌ బ్యాంక్‌ షేరు 10.14 శాతం లాభపడి రూ.102.65 వద్ద ట్రేడవుతోంది.  గత వారంతంలో నాలుగు పీఈ సంస్థల కన్సార్టియం నుంచి బ్యాంకుకు రూ .8,50 మిలియన్ల టర్మ్ షీట్ ఆఫర్ వచ్చిందని, ఈ ఆఫర్‌ ప్రకారం కన్సార్టియం హెడ్‌ కంపెనీకి బ్యాంకులో 10 శాతం

Most from this category