STOCKS

News


ఆహార శుద్ధి పరిశ్రమలోకి బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ: బాదల్‌

Wednesday 26th September 2018
news_main1537938375.png-20576

న్యూఢిల్లీ: ఆహార శుద్ధి రంగంలోకి ఈ ఏడాది ఇప్పటికే బిలియన్‌ డాలర్లకు (రూ.7,200 కోట్లు) పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తెలిపారు. ‘‘2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి ఆహార శుద్ధి పరిశ్రమలోకి వస్తున్న ఎఫ్‌డీఐలు ఏటా 500 మిలియన్‌ డాలర్లుగా ఉండేవి. ఈ ఏడాది బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించాం. ఈ మార్గంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో సీఐఐ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం... ఈ రంగంలోకి 2017-18లో 904.9 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 727 మిలియన్‌ డాలర్లు, 505 మిలియన్‌ డాలర్లు, 515 మిలియన్‌ డాలర్ల చొప్పున వచ్చాయి. ‘‘రిటైలర్లు సాగు ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచి సమీకరించుకోవాలి. మెట్రో, వాల్‌మార్ట్‌ నేరుగా రైతులతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2017’ సందర్భంగా 14 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ రాగా, 70 శాతం ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. శుద్ధి స్థాయి మరింత పెరిగితే ఆహార వృధా తగ్గుతుంది. ఏటా రూ.లక్ష కోట్ల మేర వృధా జరుగుతోందని అంచనా’’ అని మంత్రి వివరించారు. 



You may be interested

జూలైలో 14 లక్షల ఉద్యోగాలు!?

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాల కల్పన జూలైలో 11 నెలల గరిష్ట స్థాయికి చేరి 13.97 లక్షలుగా నమోదైంది. దీంతో కలిపితే ఎంప్లాయీస్‌ స్టేట్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) కొత్త చందాదారులు గతేడాది సెప్టెంబర్‌ నుంచి 1.34 కోట్లకు చేరినట్టు కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌వో) నివేదిక తెలిపింది. జూలైలో ఈఎస్‌ఐసీ నిర్వహించే ఆరోగ్య బీమా పథకంలో కొత్తగా 13.97 లక్షల మంది చేరారు. 2017 సెప్టెంబర్‌ తర్వాత ఇదే అత్యధిక

ఆగస్టులో మెరుగైన ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: రాబడులు, వ్యయాలకు సంబంధించి కేంద్ర ఫైనాన్షియల్‌ పరిస్థితి ఆగస్టులో మెరుగుపడింది. మంగళవారం విడుదలైన తాజా గణాంకాలను చూస్తే,  ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) ఆగస్టు నాటికి 2018- 19 బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో 94.7 శాతానికి చేరింది. గతేడాది ఇదే నెలకు అప్పటి (2017-18) బడ్జెట్‌ అంచనాల్లో 96.1 శాతంగా ఉంది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా

Most from this category