STOCKS

News


దేశంలో 4,615 కుటుంబ వ్యాపార సంస్థలు

Wednesday 8th August 2018
news_main1533704798.png-19041

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో కుటుంబ వ్యాపార సంస్థలు పెరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో 4,615 కంపెనీలు కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్నవేనని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి చెందిన థామస్‌ స్కమిథినీ సెంటర్‌ ఫర్‌ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్‌ సర్వే తెలిపింది. దశాబ్ధ కాలంగా స్టేట్‌ ఓన్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎస్‌వోఈ), ఇతర బిజినెస్‌ గ్రూప్‌ సంస్థలు (ఓబీజీఎఫ్‌), స్టాండలోన్‌ నాన్‌–ఫ్యామిలీ కంపెనీలు (ఎన్‌ఎఫ్‌)లతో పోలిస్తే కుటుంబ వ్యాపార సంస్థల్లోని ప్రమోటర్ల వాటా పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ నుపూర్‌ పవన్‌ భంగ్‌ తెలిపారు.
 You may be interested

రూ.43 కోట్లు సమీకరించిన సత్య మైక్రో క్యాపిటల్‌

Wednesday 8th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఢిల్లీకి చెందిన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ సత్య క్యాపిటల్‌ రూ.43 కోట్ల నిధులను సమీకరించింది. జపాన్‌కు చెందిన గోజో అండ్‌ కంపెనీ, పాత ఇన్వెస్టర్‌ అయిన డియా వికాస్‌ క్యాపిటల్‌ ఈక్విటీ రూపంలో ఈ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆర్ధిక సంవత్సరంలో రూ.50 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. ఇప్పటివరకు సత్య మైక్రో క్యాపిటల్‌ 11 రాష్ట్రాల్లో సుమారు లక్ష

ఆండ్రాయిడ్‌ ‘పై’ వచ్చేసింది

Wednesday 8th August 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ ప్రియులకు గూగుల్‌ తీపి కబురు తెచ్చింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ప్రస్తుతం ‘ఓరియో’ ఓఎస్‌ను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగిస్తున్నారు. సమాచార గోప్యత(ప్రైవసీ)కు సంబంధించి మరిన్ని మెరుగైన ఫీచర్లతో పాటు పలు అధునాతన అంశాలను కొత్త ఓఎస్‌లో జతచేసినట్లు గూగుల్‌ పేర్కొంది. ముఖ్యంగా ‘పై’ ఓఎస్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సామర్థ్యం అత్యంత ముఖ్యమైనదిగా

Most from this category