STOCKS

News


రూపాయి పతనం కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగెటివ్‌’

Tuesday 11th September 2018
news_main1536641656.png-20147

హెడ్జింగ్‌ వంటి చర్యలు తీసుకుంటే భయం లేదు: మూడిస్‌ న్యూఢిల్లీ: రూపాయి అదే పనిగా విలువను కోల్పోతుండడంతో... రూపాయిల్లో ఆదాయం గడిస్తూ, అదే సమయంలో డాలర్ల రూపంలో రుణాలను తీసుకున్న కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగెటివ్‌’(రుణాల పరంగా ప్రతికూల స్థితి) అని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడిస్‌ పేర్కొంది. ఈ ఏడాది రూపాయి ఇంత వరకు డాలర్‌తో 13 శాతం క్షీణించింది. ‘‘అయితే, చాలా వరకు అధిక రేటింగ్‌ కలిగిన భారత కార్పొరేట్‌ కంపెనీలు రూపాయి మరో 10 శాతం (ఈ నెల 6 నాటి రూ.72.11 ఆధారంగా) పడిపోయే అంచనాల ఆధారంగా హెడ్జింగ్‌ వంటి రక్షణాత్మక చర్యలను తీసుకున్నాయి’’ అని మూడిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నాలిసా డిచియారా తెలిపారు. మూడిస్‌ నుంచి అధిక ఈల్డ్‌, ఈన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఉన్న 24 భారత కంపెనీలు అమెరికా డాలర్ల రూపంలో కాంట్రాక్టులను కలిగి ఉండడంతో రూపాయి పతన ప్రభావం నుంచి సహజంగానే రక్షణ ఉంటుందని మూడిస్‌ తెలిపింది. 
వర్ధమాన కరెన్సీలకు మారకం రిస్క్‌: నోమురా
వర్ధమాన దేశాలకు కరెన్సీ రిస్క్‌ ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. శ్రీలంక, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా, అర్జెంటీనియా, ఈజిప్ట్‌, టర్కీ, ఉక్రెయిన్‌ దేశాల కరెన్సీలకు మారకం సంక్షోభం ఉందని, వీటి స్కోరు 100కు పైగా ఉన్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో విధానాలు సాధారణంగా మారడం, వాణిజ్య రక్షణాత్మక ధోరణులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను తిరిగి మదింపు వేసుకుంటున్నారని నోమురా వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌ ‘డామోక్లెస్‌’ తెలిపింది. 100కు పైగా స్కోరు ఉంటే రానున్న 12 నెలల్లో ఆయా దేశాల కరెన్సీలకు మారకం సంక్షోభం పొంచి ఉందని అర్థం. 150కు పైగా స్కోరు ఉంటే ఏ సమయంలోనైనా మారకం సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సంకేతం. ఈ సూచీ ప్రకారం శ్రీలంక స్కోరు 175 కాగా, దక్షిణాఫ్రికా 143, అర్జెంటీనియా 140, పాకిస్తాన్‌ 136, ఈజిప్ట్‌ 111, టర్కీ 104, ఉక్రెయిన్‌ 100 స్కోరుతో ఉన్నాయి. 
భారత్‌ స్కోరు 25
భారత దేశానికి సంబంధించి డామోక్లెస్‌ స్కోరు 25గా ఉండడం గమనార్హం. ‘‘భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 2018లో మోస్తరు స్థాయిలో (2012లో 9.7 శాతం నుంచి 2018లో 4.5 శాతానికి) ఉంటుంది. కరెంటు ఖాతా లోటు జీడీపీలో గతంలో 5 శాతంగా ఉండగా 2018లో 2.5 శాతంగా ఉంటుంది. ఆర్‌బీఐ వద్ద సమృద్ధిగా విదేశీ మారకం నిల్వలు ఉన్నాయి. దీంతో డామోక్లెస్‌ స్కోరు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికి 25 శాతానికి తగ్గింది’’ అని నోమురా వివరించింది. కరెంటు ఖాతా లోటు పరంగా అంతర్జాతీయ అంశాల రిస్క్‌ ఉంటుందని, అధిక చమురు ధరలు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెనక్కి వెళ్లిపోవడాన్ని ఒత్తిడి కలిగించే అంశాలుగా పేర్కొంది. 2019 ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలకు మళ్లడం, అంచనాలకు మించి వృద్ధి రేటు నిదానిస్తే గనుక ఈక్విటీ పెట్టుబడులు బయటకు వెళ్లేందుకు దారితీస్తుందని నోమురా హెచ్చరించింది. You may be interested

‘జాక్‌ మా’ వరసుడిగా డేనియల్ జాంగ్

Tuesday 11th September 2018

బీజింగ్‌: అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు జాక్‌ మా వెల్లడించారు. 420 బిలియన్‌ డాలర్ల (30,43,131 కోట్లు) ఈ-కామర్స్ దిగ్గజానికి తన తరువాత వరసుడిగా ప్రజాదరణ పొందిన ‘సింగిల్‌ డే సేల్‌’ ప్రచార రూపకర్త సీఈఓ డేనియల్ జాంగ్‌ను ప్రకటించారు. సోమవారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన జాక్‌ మా.. వచ్చే ఏడాది సెప్టెంబరు 10న జాంగ్‌ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు

మార్కెట్లోకి లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

Tuesday 11th September 2018

హైదరాబాద్‌: జపాన్‌ కంపెనీ టొయోటాకు చెందిన లగ్జరీ కార్ల విభాగం లెక్సస్‌.. అంతా కొత్తదైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈఎస్‌ 300హెచ్‌ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.59.13 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించామని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ తెలిపారు.  జూలైలోనే బుకింగ్‌లు... ఈ ఏడో తరం ఈఎస్‌ 300హెచ్‌ను 2.5 లీటర్‌, నాలుగు సిలిండర్‌  పెట్రోల్‌ ఇంజిన్‌తో, 44 వోల్ట్‌, 204 సెల్‌ నికెల్‌

Most from this category