STOCKS

News


ఏఎఫ్‌పీతో ఫేస్‌బుక్ జట్టు

Tuesday 6th November 2018
news_main1541481259.png-21744

న్యూఢిల్లీ: తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టే దిశగా, వాస్తవాల ధృవీకరణ కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లో ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ)తో జట్టు కట్టింది. ఎన్నికల వేళ తమ ప్లాట్‌ఫాంపై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఫేస్‌బుక్‌ న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ (భారత విభాగం) మనీష్ ఖండూరి తెలిపారు. ఇప్పటికే ఇంగ్లీష్, బెంగాలీలో కంటెంట్‌ పరిశీలన కోసం బూమ్ సంస్థతో భాగస్వామ్యం ఉందని వివరించారు. వాస్తవాల ధృవీకరణలో భాగంగా ఏఎఫ్‌పీ తదితర భాగస్వామ్య సంస్థలు ఏదైనా కంటెంట్ నకిలీదని రేటింగ్‌ ఇచ్చిన పక్షంలో సదరు వార్త తమ న్యూస్‌ ఫీడ్‌లో అట్టడుగున కనిపిస్తుందని, దీంతో వ్యాప్తి తగ్గుతుందని మనీష్ పేర్కొన్నారు. వదంతులు వ్యాపించకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. 



You may be interested

మూడో విడత ఉడాన్ రూట్ల వేలం

Tuesday 6th November 2018

ముంబై: చిన్న పట్టణాలకు చౌక విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో రూట్ల వేలానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రాథమిక బిడ్లను డిసెంబర్ 10లోగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు సమర్పించాల్సి ఉంటుంది. రూట్లను దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ పేర్లను జనవరి 7 లోగా ప్రకటించడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలని భావిస్తున్న బిడ్డర్ల కోసం నవంబర్ 6న ప్రి-బిడ్ సమావేశం ఉంటుంది.

ధంతేరాస్‌లో మెరిసిన పసిడి

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైన రోజుగా భావించే ధంతేరాస్‌లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ధరలు భారీగా ఉండడం, దీనికితోడు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఉండడంతో ధంతేరాస్‌నాడు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్‌ కొనసాగుతుందన్నందు, వచ్చే వారాల్లో పసిడి, ఆభరణాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఆభరణాలకన్నా, నాణేలకు అధికంగా డిమాండ్‌

Most from this category