STOCKS

News


మహిళా ఉద్యోగులు డబుల్‌!!

Thursday 11th July 2019
news_main1562822324.png-26971

  • అయిదేళ్లలో ఫేస్‌బుక్ ప్రణాళిక

శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే నల్లజాతి వారు, లాటిన్ అమెరికన్ ఉద్యోగుల సంఖ్యను సైతం రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. సిబ్బందిలో వైవిధ్యాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు సంస్థ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మాక్సిన్ విలియమ్స్ తెలిపారు. 2024 నాటికి తమ సిబ్బందిలో సగభాగం ఉద్యోగుల్లో మహిళలు, లాటిన్ అమెరికన్‌ దేశస్థులు, దివ్యాంగులు మొదలైన వారు ఉండనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం మొత్తం సిబ్బందిలో మహిళల సంఖ్య 36.9 శాతంగా ఉంది. గతేడాది ఇది 36.3 శాతం. సీనియర్ లీడర్‌షిప్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం నుంచి 32.6 శాతానికి పెరిగింది. సాంకేతిక విభాగానికి సంబంధించి మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 23 శాతం మేర ఉన్నారు. 



You may be interested

ఇండిగోతో లావాదేవీలన్ని సరైనవే

Thursday 11th July 2019

గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగోలో అవకతవకలు జరుగుతున్నాయంటూ సహ ప్రమోటరు రాజేష్‌ గంగ్వాల్ చేసిన ఆరోపణలపై మరో వ్యవస్థాపక ప్రమోటరు రాహుల్ భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్ స్పందించింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో తమ గ్రూప్ సంస్థల లావాదేవీలన్నీ సక్రమమైనవేనని పేర్కొంది. అనుబంధ పార్టీల మధ్య లావాదేవీలన్నీ సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగానే, సహేతుక రీతిలోనే జరిగాయని ఐజీఈ గ్రూప్‌ స్పష్టం చేసింది.

ఎఫ్‌పీఐలు కార్పొరేట్లలా మారొచ్చు!!

Thursday 11th July 2019

చెల్లించే స్థోమత ఉంది కనకే వారిపై పన్నుభారం ‘సర్‌చార్జీ’పై సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోడీ వ్యాఖ్య రూ.13.35 లక్షల కోట్ల వసూళ్లను సాధిస్తామని ప్రకటన న్యూఢిల్లీ: ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) మినహాయింపు ఇవ్వటానికి అవకాశం లేదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోడీ స్పష్టం చేశారు. ఎఫ్‌పీఐలు కావాలనుకున్న పక్షంలో కార్పొరేట్‌ సంస్థగా రిజిస్టర్‌ చేసుకుని, ఆ విభాగంలో ఉన్న తక్కువ రేట్ల

Most from this category