STOCKS

News


ఫేస్‌బుక్ నుంచి వీడియోకాలింగ్ పరికరం "పోర్టల్"

Tuesday 9th October 2018
news_main1539058412.png-20943

లండన్‌: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే వీడియో కాలింగ్ పరికరం "పోర్టల్"ను ఆవిష్కరించింది. 10 అంగుళాల స్క్రీన్‌ కలిగిన పోర్టల్ రేటు 199 డాలర్లుగాను, 15 అంగుళాల వెర్షన్ ధర 349 డాలర్లుగాను ఉంటుంది. స్మార్ట్‌ స్పీకర్ మార్కెట్లో అమెజాన్‌, గూగుల్‌తో పోటీపడే క్రమంలో ఫేస్‌బుక్ దీన్ని రూపొందించింది. ప్రత్యేకంగా స్కీన్ ముందరే నిల్చోవాల్సిన అవసరం లేకుండా 'హేయ్ పోర్టల్' అని పలకరించడం ద్వారా దీన్నుంచి కాల్‌ ప్రక్రియ ప్రారంభించవచ్చు. కాల్ చేస్తుండగా మధ్యలో కావాలనుకుంటే కెమెరా ఆటోమేటిక్‌గా జూమ్ అవుట్ అయి మనతో పాటు మరో వ్యక్తిని కూడా వీడియో కాల్‌లో చూపిస్తుంది. ‍అలాగే కాలర్‌ అటూ, ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నా వారినే ఫాలో అవడం, వారి మాటల్ని మాత్రమే గుర్తించడం తదితర ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. పోర్టల్‌తో వ్యక్తిగత ప్రైవసీ, భద్రతకు ముప్పేమీ ఉండబోదని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. కెమెరాను కవర్ చేసేయొచ్చని, లెన్స్‌.. మైక్రోఫోన్‌ను డిజేబుల్ కూడా చేయొచ్చని వివరించింది. ముందుగా అమెరికా మార్కెట్లో ప్రీ-ఆర్డర్‌లు తీసుకుంటున్నట్లు పేర్కొంది. 



You may be interested

ఈ సారి షాపింగ్‌ ‘పండగే’!

Tuesday 9th October 2018

గతేడాది ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ సమయంలో ప్రమోద్‌ రూ.33,000 రూపాయిల మొబైల్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ పాత మొబైల్‌ ఫోన్‌ ఎక్సేంజ్‌పై అదనంగా రూ.3,000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయడాన్ని చూశాడు. తనకు తెలిసిన వ్యక్తి దగ్గర రూ.3,000 పెట్టి పాత మొబైల్‌ కొని దాన్ని ఎక్సేంజ్‌కు పెట్టాడు. ఆ మొబైల్‌కు ఈ కామర్స్‌ సంస్థ రూ.5,000 విలువ కట్టింది. అప్‌ఫ్రంట్‌ డిస్కౌంట్‌ కింద రూ.3,000 తగ్గింపు

రూపాయి స్వల్ప రికవరీ

Tuesday 9th October 2018

రూపాయి మంగళవారం స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.89 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపు 74.07తో పోలిస్తే 0.25 శాతం లాభపడింది. రూపాయి మంగళవారం 73.85 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.986 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.975 శాతంగా ఉంది. ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.6 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ

Most from this category