STOCKS

News


తీవ్రమైన పోటీ ఉంటే.. ఒత్తిడీ ఉంటుంది..

Tuesday 6th November 2018
news_main1541480914.png-21740

న్యూఢిల్లీ: పోటీ తీవ్రంగా ఉన్న రంగాల్లో కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఎదిగే క్రమంలో ఇలాంటి సవాళ్లు సహజమేనన్నారు. ఎకానమీ వృద్ధి చెందే కొద్దీ ఒక్కో నియంత్రణ సంస్థ పోషించాల్సిన పాత్ర పరిధి కూడా విస్తృతమవుతుంటుందని ఆయన పేర్కొన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుత వృద్ధి రేటే కొనసాగిన పక్షంలో ఒకటి రెండు దశాబ్దాల్లో భారత ఎకానమీ భారీ స్థాయిలో అనేక రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. "ఎకానమీ పరిమాణం పెరుగుతుంది. పరిశ్రమ పెరుగుతుంది. సేవల రంగం పరిమాణం పెరుగుతుంది. అలాగే, ఒక్కో నియంత్రణ సంస్థ పాత్ర పరిధి కూడా పెరుగుతుంది" అని ఆయన చెప్పారు. వినియోగదారు ప్రయోజనాల పరిరక్షణే పోటీ చట్టానికి మూల స్తంభమని జైట్లీ తెలిపారు. పారదర్శకంగా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సముచిత విధానాల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థలు జరిపే కొనుగోళ్లతో ఇటు ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా చూడొచ్చని.. అలాగే అటు ఆయా ఉత్పత్తులు, సేవలను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. 



You may be interested

పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 33 శాతం అప్‌

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 33 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.190 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.253 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయంరూ.1,274 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.1,808 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎమ్‌డీ సంజయ గుప్తా తెలిపారు.

115 శాతం పెరిగిన నాట్కో లాభం

Tuesday 6th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం కిందటేడాదితో పోలిస్తే 115 శాతం అధికమై రూ.181.6 కోట్లకు ఎగసింది. టర్నోవరు 35 శాతం పెరిగి రూ.583 కోట్లను తాకింది. ఏప్రిల్‌- సెప్టెంబరు కాలంలో రూ.1,158 కోట్ల టర్నోవరుపై రూ.362 కోట్ల నికరలాభం నమోదైంది. ఫార్ములేషన్స్‌ వ్యాపారంలో దేశీయం మార్కెట్‌తోపాటు ఎగుమతుల పరంగా మెరుగైన వృద్ధి

Most from this category