STOCKS

News


ఎయిర్‌ ఇండియాపై ఎతిహాద్‌ ఆసక్తి

Tuesday 30th October 2018
news_main1540877631.png-21575

  • ఎయిర్‌ ఇండియాపై ఎతిహాద్‌ ఆసక్తి
  • భారత్‌లో భాగస్వాముల కోసం అన్వేషణ
  • అనిల్‌ అంబానీ గ్రూపుతో చర్చలు

న్యూఢిల్లీ: గల్ఫ్‌కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎతిహాద్‌, భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా పట్ల ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌లో ప్రముఖ కార్పొరేట్‌ గ్రూపు భాగస్వామ్యంతో ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటా కొనుగోలు చేయాలన్నది ఎతిహాద్‌ ఆలోచన. ఇందుకు సంబంధించి అనిల్‌ అంబానీ గ్రూపునకు ప్రతిపాదన పంపినట్టు తెలియవచ్చింది. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాల విక్రయానికి ప్రైవేటు సంస్థల నుంచి కేంద్రం ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఏఐశాట్స్‌లో 50 శాతం వాటాల విక్రయం కూడా ఇందులోనే కలిసి ఉంది. ‘‘ఎయిర్‌ ఇండియాను కన్సార్షియం రూపంలో కొనుగోలు చేసేందుకు భాగస్వామి కోసం ఎతిహాద్‌ అన్వేషిస్తోంది. అనిల్‌ అంబానీ గ్రూపు సహా పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది’’అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే, ఈ చర్చలు భాగస్వామ్యం వరకూ వెళ్లకపోవచ్చని, కాకపోతే విదేశీ ఎయిర్‌లైన్‌ సంస్థలు భారత్‌ పట్ల ఆసక్తితో ఉన్నట్టు ఇది తెలియజేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కూడా ఎయిర్‌ ఇండియా కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తు‍న్నాయని, సరైన భాగస్వామ్యం కోసం చూస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఎతిహాద్‌ ఎయిర్‌ ఇండియాలో వాటాలు కొనుగోలు చేస్తే... ఆ సంస్థకు భారత విమానయాన రంగంలో రెండో పెట్టుబడి అవుతుంది. 2007లో జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్‌ 24 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం గమనార్హం.
ఎతిహాద్‌ ఆసక్తికి కారణం?
‘‘ఎయిర్‌ఫ్రాన్స్‌- కేఎల్‌ఎంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ గతేడాది నవంబర్‌లో కుదుర్చుకున్న వ్యాపార భాగస్వామ్యం అనంతరం ఆ సంస్థతో సంబంధాలు సరిగ్గా లేవు. కానీ, ఎతిహాద్‌ భారత్‌ మార్కెట్‌ను వీడాలనుకుకోవడం లేదు. కనుక అవకాశం కోసం ఎదురు చూస్తోంది’’ అని మరో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, విమానయాన రంగంలో అవకాశం కోసం అనిల్‌ అంబానీ గ్రూపు గతంలో ప్రయత్నించింది. తాజా పరిణామంపై అడాగ్‌ గ్రూపు వర్గాలు స్పందిస్తూ... తమ గ్రూపు ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఎయిర్‌ ఇండియాకు బిడ్‌ వేసే అవకాశాలు లేవని పేర్కొన్నాయి.



You may be interested

జాగ్వార్‌ దేశీ ఎఫ్‌-పేస్‌

Tuesday 30th October 2018

ధర రూ.63.17 లక్షలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవ‌ర్ (జేఎల్‌ఆర్‌)... మేకిన్‌ ఇండియా పాలసీలో భాగంగా దేశీయంగా ఉత్పత్తి చేసిన జాగ్వార్ ‘ఎఫ్‌–పేస్‌’ ఎస్‌యూవీని సోమవారం మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రెండు-లీటర్ల టర్బో చార్జ్ ఇంజినియం పెట్రోల్ ఇంజిన్‌ను కలిగిన ఈ కారు ధర రూ.63.17 లక్షలు. పార్క్ అసిస్ట్, లేన్ కీప్‌ అసిస్ట్, కాబిన్ ఎయిర్ ఐయోనైజేషన్, డ్రైవర్ కండీషన్‌ మానిటరింగ్‌ వంటి

సగం తగ్గిన బీపీసీఎల్‌ లాభం

Tuesday 30th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నికర లాభం సెప్టెంబర్‌ క్వార్టర్లో 48 శాతం తగ్గిపోయి రూ.1,218 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.2,357 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.64,133 కోట్ల నుంచి రూ.82,884 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా వ్యయాలు పెరిగిపోవడం ప్రభావం చూపించింది. వ్యయాలు రూ.61,475 కోట్ల నుంచి రూ.81,550 కోట్లకు 

Most from this category