STOCKS

News


ఇథియోపియాలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అధికారుల అరెస్టు

Wednesday 5th December 2018
news_main1543985592.png-22651

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా సంస్థ ఐఎల్‌౾అండ్‌ఎఫ్‌ఎస్ సిబ్బందిని కష్టాలు వెన్నాడుతున్నాయి. సిబ్బందికి జీతభత్యాలు, ప్రభుత్వానికి పన్నుల చెల్లించటం లేదన్న ఆరోపణలపై కంపెనీకి చెందిన ముగ్గురు భారతీయ అధికారులను ఇథియోపియా పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్న ఆరోపణలపై గత నెల.. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థ ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌ (ఐటీఎన్‌ఎల్‌) అధికారులు ఏడుగురిని ఒరోమియా, అమ్హారా రాష్ట్రాల్లోని సిబ్బంది బంధించిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరిని ఆరోగ్య కారణాల రీత్యా గత వారం విడుదల చేశారు. ఇథియోపియాలో కంపెనీకి 15 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు మొత్తం రూ. 94,216 కోట్ల మేర రుణభారం ఉంది. 



You may be interested

చమురు మంట తగ్గినా... గృహోపకరణాలు చల్లారలేదు

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: చమురు ధరలు శాంతించాయి... డాలర్‌తో రూపాయి కొంచెం బలం పుంజుకుంది. అయినా, గృహోపకరణాల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇటీవలి కాలంలో బ్యారెల్‌కు 80 డాలర్ల వరకు వెళ్లి తిరిగి 60 డాలర్ల లోపునకు పడిపోగా... డాలర్‌తో 74కు పైగా దిగజారిన రూపాయి తిరిగి 71 లోపునకు వచ్చేసింది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపకరణాల తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి.

కేశోరామ్‌ నుంచి విడిగా టైర్ల విభాగం

Wednesday 5th December 2018

కోల్‌కత: బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌  కంపెనీ నష్టాలొస్తున్న తన టైర్ల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా (బిర్లా టైర్స్‌) విడగొట్టనుంది. ఫలితంగా కంపెనీ విలువ మరింత పెరగగలదని, మూలధన నిధులు సమీకరణ మరింత సులభమవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ కంపెనీ చేపట్టిన రెండో భారీ పునర్వ్యస్థీకరణ ఇది. డీమెర్జర్‌లో భాగంగా ఒక్కో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌కు రూ.10 ముఖ విలువ గల ఒక్కో బిర్లా టైర్స్‌ షేర్‌

Most from this category