STOCKS

News


కొనే సంస్థల అభీష్టం మేరకే..!

Thursday 7th February 2019
news_main1549522183.png-24066

  • మా వాటాలో మెజారిటీ అడిగినా ఇచ్చేస్తాం
  • జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్ల వెల్లడి

న్యూఢిల్లీ: రుణ భారం తగ్గించుకునే క్రమంలో అవసరమైతే కంపెనీలో 50 శాతానికి పైగా వాటా విక్రయించడానికి కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీ) ప్రమోటర్లు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఇద్దరు ఇన్వెస్టర్లతో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎండీ పునీత్ గోయెంకా చెప్పారు. డీల్‌ కుదుర్చుకునేందుకు మార్చి- ఏప్రిల్ దాకా కంపెనీ డెడ్‌లైన్ విధించుకున్నట్లు తెలియజేశారు. "మా ఉద్దేశంలో ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ ఎవరైనా 50 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేయదల్చుకున్న పక్షంలో, దానిక్కూడా మేం సిద్ధం" అన్నారాయన. రుణాలు చెల్లించేందుకు నిధులు సమీకరించడం కోసం వ్యూహాత్మక భాగస్వామికి 50 శాతం దాకా వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర కొద్ది రోజుల క్రితమే చెప్పిన నేపథ్యంలో తాజాగా గోయెంకా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2018 డిసెంబర్ 31 నాటికి జీ లో ప్రమోటర్లకు 41.62 శాతం వాటాలుండగా.. అందులో సగం (20 శాతం) వాటాలు విక్రయించేందుకు చంద్ర ఆఫర్ ఇచ్చారు. గత నెల 25న జీ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన సంస్థల షేర్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తడం, ఒక్క రోజే రూ.13,352 కోట్ల మేర మార్కెట్ వేల్యుయేషన్ హరించుకుపోవడం తెలిసిందే. ఇన్‌ఫ్రా తదితర వ్యాపార విభాగాలు దెబ్బతినడంతో కంపెనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందంటూ ఆ మర్నాడే చంద్ర ప్రకటించారు. తనఖాలో ఉంచిన షేర్లు అమ్మేయకుండా, పరిస్థితులు చక్కబడేదాకా కాస్త సహకరించాలంటూ బ్యాంకర్లు. ఫండ్ హౌస్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
సమయమివ్వాలంటూ సెబీకి ఫండ్స్ వినతి...
వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో ఎస్సెల్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకునేదాకా ఆ సంస్థల డిబెంచర్ ట్రస్ట్ డీడ్‌ల నిబంధనలు సవరించేందుకు అనుమతించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కోరాయి. ధర తగ్గే కొద్దీ తనఖాలో ఉంచిన షేర్లను విక్రయించకుండా వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ను వెతుక్కునే దాకా ఎస్సెల్ గ్రూప్‌నకు కొంత సమయం ఇచ్చేందుకు కొత్త నిబంధనలు ఉపయోగపడే అవకాశముంది. ఎస్సెల్ గ్రూప్ డిబెంచర్లలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు దాదాపు రూ.8,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఒకవేళ కంపెనీ గానీ దివాలా తీస్తే ఈ మొత్తం పెట్టుబడులు పోతాయని ఆందోళన చెందుతున్న ఫండ్స్‌ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి.You may be interested

ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి

Thursday 7th February 2019

ఆర్థిక సేవల కంపెనీ కార్వీ విశ్లేషణ బంగారం, వెండిలకు మరింత మెరుపు! న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 78 స్థాయిని చూసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ కార్వీ తెలియజేసింది. ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్ లోటులు దీనికి ప్రధాన కారణం కానున్నాయని సంస్థ తన వార్షిక కమోడిటీ, కరెన్సీ నివేదికలో పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు సైతం ఈ ఏడాది గణనీయంగా పెరిగే

వోడాఫోన్‌ ఐడియా నష్టం రూ.5005 కోట్లు

Thursday 7th February 2019

రూ.11,983 కోట్లకు మొత్తం ఆదాయం సీక్వె‍న్షియల్‌గా 52 శాతం వృద్ధి- 4జీ నెట్‌వర్క్‌ కవరేజ్‌పై మరింత దృష్టి !- కంపెనీ సీఈఓ బాలేశ్‌ శర్మ వెల్లడి న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్‌-ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం  ఇదే క్వార్టర్‌లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్‌ల విలీనం

Most from this category