News


ఓపెన్‌ మార్కెట్లో షేర్లను అమ్ముకున్న జీ ప్రమోటర్లు

Tuesday 5th February 2019
news_main1549348001.png-24023

  • ఆరు లిస్టెడ్‌ సంస్థల షేర్ల విక్రయంతో రూ.1,050 కోట్లు
  • జవనరి 25 - ఫిబ్రవరి 1 మధ్య లావాదేవీలు

న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జీ గ్రూపు ప్రమోటర్లు ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్‌ మార్కెట్లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, డిష్‌టీవీ, జీ మీడియా కార్పొరేషన్‌, సిటీ నెట్‌వర్క్స్‌, జీ లెర్న్‌ కంపెనీల్లో వాటాలను అమ్మేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రంగంలో చేసిన వ్యాపారాలు బెడిసి కొట్టాయని, భారీ రుణ భారాన్ని తీర్చడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు జీ ప్రమోటర్‌ సుభాష్‌చంద్ర గత నెల 26న ప్రకటించడం గమనార్హం. గ్రూపులో రెండు ప్రముఖ సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిష్‌ టీవీ ఇండియాలో ప్రమోటర్లు తమ వాటాలను తనఖా పెట్టి మరీ రుణాలు తీసుకున్నారు. అయితే,, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు రుణదాతలతో ఒప్పందం చేసుకున్నామని, ఇందులో భాగంగా రుణాల చెల్లింపులకు సెప్టెంబర్‌ వరకు సమయం లభించినట్టు ఆదివారమే ‍ప్రకటన వెలువడింది.
అమ్మకాలు వీటిల్లోనే...
- జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల సంస్థలు అయిన... సైక్వేటర్‌ మీడియా సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 1.69 శాతం, ఎస్సెల్‌ కార్పొరేట్‌ ఎల్‌ఎల్‌పీ 0.85 శాతం మేర షేర్లను అమ్మేశాయి. గ్రూపులో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అతిపెద్ద కంపెనీ కాగా, ఇందులో వాటాల విక్రయం ద్వారానే ప్రమోటర్లకు రూ.874.11 కోట్లు సమకూరాయి.
- డిష్‌ టీవీలో వరల్డ్‌ క్రెస్ట్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ 0.86 శాతం, డైరెక్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ వెంచర్స్‌ 0.80 శాతం, వీనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 0.35 శాతం చొప్పున రూ.97.34 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.
- జీ మీడియా కార్పొరేషన్‌లో ఏఆర్‌ఎం ఇన్‌ఫ్రా అండ్‌ యుటిలిటీస్‌ 2.38 శాతం, 25ఎఫ్‌పీఎస్‌ మీడియా 3.09 శాతం మేర షేర్లను అమ్మేశాయి. వీటి విలువ రూ.45.05 కోట్లు.
- సిటీ నెట్‌వర్క్స్‌లో ఆరో మీడియా అండ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 4.50 శాతం వాటాను విక్రయించింది. దీని విలువ రూ.28.88 కోట్లుగా ఉంది.
- జీ లెర్న్‌లో జయ్‌నీర్‌ ఇన్‌ఫ్రా వపర్‌ అండ్‌ మల్టీవెంచర్‌ 0.34 శాతం వాటాను అమ్మేసింది. విలువ రూ.2.92 కోట్లు.
- డిలిజెంట్‌ మీడియా కార్పొరేషన్‌లో ఏఆర్‌ఎం ఇన్‌ఫ్రా అండ్‌ యుటిలిటీస్‌ 1.41 శాతం, 25ఎఫ్‌పీఎస్‌ మీడియా 3.09 శాతం వాటాలను విక్రయించగా, వీటి విలువ రూ.2.90 కోట్లుగా ఉంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం ర్యాలీ

Tuesday 5th February 2019

ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మంగళవారం ఈ రంగానికి చెందిన షేర్లు లాభాల బాటపట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. నేటి క్యూ3 గణాంకాల విడుదల నేపథ్యంలో పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ 5శాతం ర్యాలీ చేసింది. జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ షేరు 3శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌ 1శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఈ క్యూ3లో ఆశించిన

ట్రూజెట్‌కు కొత్తగా రెండు విమానాలు

Tuesday 5th February 2019

ఏప్రిల్‌ నాటికి సంస్థలోకి డిసెంబరుకల్లా మరో మూడు ఉడాన్‌–3లో రెండు రూట్లు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్‌ ఏప్రిల్‌ కల్లా ఏటీఆర్‌ 72–500 విమానాలను మరో రెండింటిని సమకూర్చుకుంటోంది. ఇప్పటికే సంస్థ ఖాతాలో అయిదు విమానాలున్నాయి. వీటిలో ఏటీఆర్‌ 72–500 రకం మూడు, ఏటీఆర్‌ 72–600 రకం రెండు ఉన్నాయి. డిసెంబరు చివరికి మరో మూడు విమానాలు వస్తాయని, దీంతో సంస్థ వద్ద మొత్తం 10 విమానాలు కొలువుదీరతాయని ట్రూజెట్‌ను ప్రమోట్‌

Most from this category