STOCKS

News


నిత్యాంక్‌ ఇన్‌ఫ్రాపవర్‌తో సంబంధాల్లేవు

Monday 28th January 2019
Markets_main1548648779.png-23838

  • మనీలాండరింగ్‌ ఆరోపణలను ఖండించిన ఎస్సెల్‌ గ్రూపు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసిన నిత్యాంక్‌ ఇన్‌ఫ్రా పవర్‌ అండ్‌ మల్టీవెంచర్స్‌ సంస్థపై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు చేస్తుండగా, ఈ సంస్థతో తమకు సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలను ఎస్సెల్‌ గ్రూపు కంపెనీలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, డిష్‌ టీవీ ఖండించాయి. నిత్యాంక్‌ ఇన్‌ఫ్రా స్వతంత్ర కంపెనీ అని, ఇది ఎస్సెల్‌ గ్రూపునకు సంబంధించినది కాదని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వివరణ ఇచ్చింది. ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తా కథనంలో పేర్కొనట్టు... ఎటువంటి లావాదేవీల్లోనూ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర లేదని స్పష్టం చేసింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా హాని కలిగించేందుకు చేస్తున్నదేనని, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ఎస్‌ఎఫ్‌ఐవో అడిగిన పూర్తి సమాచారాన్ని ఎస్సెల్‌ గ్రూపు సంస్థలు ఇప్పటికే అందించాయని, అదనంగా ఇంకేమీ సమాచారం కోరలేదని స్పష్టం చేసింది. వీడియోకాన్‌ డీ2హెచ్‌ను విలీనం చేసుకునే కార్యక్రమంలో నిత్యాంక్‌తో ఎటువంటి లావాదేవీలు జరగలేదని డిష్‌ టీవీ సైతం స్పష్టం చేసింది.



You may be interested

రేటింగ్‌లు ఆధారంగా పెట్టుబడులు పెట్టవద్దు.

Monday 28th January 2019

ప్ర: నేను గత కొంతకాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను.  కనీసం 10–15 ఏళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనేది నా ఆలోచన. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచాలనుకుంటున్నాను. అయితే నా పోర్ట్‌ఫోలియోలోని అన్ని మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ గత ఏడాది ఒక్క డిసెంబర్‌ నెలలోనే 3–4 శాతం వరకూ నష్టపోయాయి. వీటిల్లోంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా  ? -సంజయ్‌, విజయవాడ జ: మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌

నేడు ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో గోయల్‌ భేటీ

Monday 28th January 2019

న్యూఢిల్లీ: కీలకమైన మధ్యంతర బడ్జెట్‌కు మూడు రోజుల ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో సోమవారం సమావేశం కానున్నారు. దీనికి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఎంఎస్‌ఎంఈ, సాగు రంగానికి రుణ వితరణ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు పథకాల పనితీరు, ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

Most from this category