STOCKS

News


ఎస్సార్‌ స్టీల్‌పై ఎస్సార్‌ గ్రూపు న్యాయపోరాటం

Monday 29th October 2018
news_main1540789642.png-21550

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కోసం తీసుకున్న రుణాలన్నింటినీ తాను తీర్చివేసేందుకు సిద్ధమంటూ ఎస్సార్‌ గ్రూపు రూ.54,389 కోట్లతో ముందుకు రాగా, దీనికి బదులు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ రూ.42,000 కోట్లతో ఆర్సెలర్‌ మిట్టల్‌ చేసిన ఆఫర్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తమ ఆఫర్‌ను అనుమతిస్తే బ్యాంకులు రుణాలపై నష్టపోవాల్సిన అవసరం లేదంటూ రుణదాతల కమిటీ నిర్ణయాన్ని ఎస్సార్‌ గ్రూపు న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్సార్‌ గ్రూపు ప్రమోటర్లు అయిన రుయాలు గతంలో ఏజిస్‌ అమెరికా కార్యకలాపాలను రూ.4,200 కోట్లకు, ఏజిస్‌ను రూ.2,000 కోట్లకు, ఎస్సార్‌ ఆయిల్‌ను రూ.72,000 కోట్లకు, ఈక్వినాక్స్‌ను రూ.2,400 కోట్లకు విక్రయించడం ద్వారా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకున్న విషయం గమనార్హం. ఇప్పుడు ఎస్సార్‌ స్టీల్‌ కోసం తీసుకున్న రుణాలు రూ.54,389 కోట్లను తీర్చేవేసేందుకు బ్యాంకులు అనుమతిస్తే మొత్తం రుణ భారం రూ.1.25 లక్షల కోట్ల మేర తగ్గించుకున్నట్టు అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.



You may be interested

పెద్ద ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆదాయ వృద్ధి: క్రిసెల్‌

Monday 29th October 2018

న్యూఢిల్లీ: అమెరికాలో విక్రయాలు మెరుగుపడడం, రూపాయి బలహీతన, దేశీయంగా డిమాండ్‌ పుంజుకోవడం వంటి అంశాలతో పెద్ద ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండంకెల్లో ఆర్జించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన దేశీయ ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆర్జన మేలు చేస్తుందని పేర్కొంది. అమెరికా, దేశీయ మార్కెట్లు వీటికి 30 శాతం, 35 శాతం మేర ఆదాయలు తెచ్చిపెట్టేవిగా తెలిపింది.

సబ్సీడీ నగదు బదిలీకి ఆధార్‌ ఈ-కేవైసీ వాడొచ్చు

Monday 29th October 2018

బ్యాంకులకు యూఐడీఏఐ స్పష్టత న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు సంబంధించి నగదు బదిలీ (డీబీటీ) లబ్ధిదారుల ధృవీకరణ కోసం బ్యాంకులు ఆధార్ ఈ-కేవైసీని ఉపయోగించవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ యూఐడీఏఐ స్పష్టతనిచ్చింది. ఒకవేళ ఖాతాదారు స్వచ్ఛందంగా అనుమతి ఇచ్చిన పక్షంలో వారి ధృవీకరణకు ఆఫ్‌లైన్‌లో పేపరు రూపంలోని ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ధృవీకరణ కోసం ఆధార్‌ను ఏయే సందర్భాల్లో, ఏయే రూపాల్లో ఉపయోగించవచ్చో బ్యాంకులకు

Most from this category