STOCKS

News


ఎస్కార్ట్స్‌ చైర్మన్‌గా నిఖిల్ నందా

Wednesday 8th August 2018
news_main1533704394.png-19037

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా నిఖిల్ నందా నియమితులయ్యారు. ఈయన ఎన్నికను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఎస్కార్ట్స్‌ చైర్మన్‌ రాజన్‌ నందా కన్నుమూయడంతో ఆయన కుమారుడు నిఖిల్ నందా గ్రూప్‌ బాధ్యతలను చేపట్టారు. ఈ విషయాన్ని కంపెనీ బోర్డ్‌ అధికారికంగా ప్రకటించింది. You may be interested

ఐపీఓ పత్రాలు సమర్పించిన ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌

Wednesday 8th August 2018

న్యూఢిల్లీ: అసెట్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,000 కోట్ల మేర నిధులు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.600 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన పీఈ సంస్థ, ఏఐ గ్లోబల్‌ 1.35

హెచ్‌ఎస్‌బీసీ భారత ఖాతాదారుల వివరాలు వెల్లడి..!

Wednesday 8th August 2018

న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకుల్లో భారత కుబేరులు దాచుకున్న నల్లధనం వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. స్విట్జర్లాండ్ అత్యున్నత న్యాయస్థానం భారతీయుల సమాచారాన్ని ఆ దేశ ప్రభుత్వానికి అందించాలని హెచ్‌ఎస్‌బీసీని ఆదేశించిన నేపథ్యంలో మరో 10 రోజుల్లోనే డేటా తమ చేతికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హెచ్‌ఎస్‌బీసీలో ఉన్నటువంటి మొత్తం డిపాజిట్లపై అధికారిక అంచనా లేదని, విదేశాలలో రూ.8,448 కోట్లు ప్రకటించని ఆదాయం ఉండగా..

Most from this category