STOCKS

News


ఎస్కార్ట్స్‌ గ్రూపు చైర్మన్‌ రాజన్‌నందా కన్నుమూత

Tuesday 7th August 2018
news_main1533618325.png-18991

న్యూఢిల్లీ: ఎస్కార్ట్స్‌ గ్రూపు చైర్మన్‌ రాజన్‌ నందా (76) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నందా 1965లో 23 ఏళ్ల వయసులో ఎస్కార్ట్స్‌లో చేరారు. 1994లో తన తండ్రి, గ్రూపు వ్యవస్థాపక చైర్మన్‌ హెచ్‌పీ నందా తప్పుకోవడంతో, ఆ బాధ్యతలు స్వీకరించి గ్రూపు చైర్మన్‌ అయ్యారు. పలు వాణిజ్య, పారిశ్రామిక సంఘాల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. సీఐఐ నేషణల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, వ్యవసాయ కమిటీకి చైర్మన్‌గానూ వ్యవహరించారు. ట్రాక్టర్లు, నిర్మాణరంగ ఎక్విప్‌మెంట్‌ తయారీలో ఎస్కార్ట్స్‌ ప్రముఖ కంపెనీ అనే విషయం తెలిసిందే. 



You may be interested

తెలంగాణలో బెనెల్లి బైక్స్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌

Tuesday 7th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇటాలియన్‌ సూపర్‌ బైక్స్‌ బ్రాండ్‌ ‘బెనెల్లి’ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. ఇందుకు తెలంగాణ వేదిక అవుతోంది. సోమవారమిక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో బెనెల్లి బోర్డ్‌ డైరెక్టర్‌ జార్జ్‌ వాంగ్‌, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బెనెల్లి భారత భాగస్వామి

అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లాభం రూ.697 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ ‍స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీ సెజ్‌) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.697 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం రూ.768 కోట్లతో పోల్చితే 9 శాతం క్షీణత నమోదైందని ఏపీ సెజ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,960 కోట్ల నుంచి రూ.2,704 కోట్లకు తగ్గిందని ఏపీసెజ్‌ సీఈఓ కరణ్‌ అదానీ తెలిపారు.

Most from this category